కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ ఐవీఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన జాబితాతోపాటు భూమిని వెంటనే అసైన్‌మెంట్ కమిటీలతో ఆమోదింపజేయాలన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జి మం్ర, లేదా జిల్లా మంత్రి అనుమతితో పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. గత విడతకు సంబంధించి అసైన్‌మెంట్ కమిటీల ఆమోదం ఆలస్యమైన కారణంగా పంపిణీలో జాప్యమైందన్నారు. ఈసారి అలా కాకుండా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించి, ఈ సమస్య రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
పట్టాలతోపాటు భూములు చూపించాలి
ఈ విడత లబ్ధిదారులకు పట్టాలతోపాటు భూములు సైతం వెంటనే చూపించాలన్నారు. ఇక ఎస్‌డీ రికార్డ్సు ప్రకారం ఏడు రకాల సర్టిఫికెట్లను అక్కడికక్కడే పంపిణీ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ విడత భూ పంపిణీకి సంబంధించి ఇది వరకే రెండు నియోజకవర్గాల్లో ఆమోదం తీసుకున్నామని జే సీ ఎల్.శర్మన్ వివరించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో ఆమోదించి ఈ నెలాఖరు నాటికి పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, కలెక్టరేట్ ఏఓ కిషన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నెలాఖరులోగా భూ పంపిణీని పూర్తి చేయాలి
Published Fri, Dec 13 2013 3:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement