భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ కేంద్రం చైర్మన్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యారు.
భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ కేంద్రం చైర్మన్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యారు. శుక్రవారం ఆయన ఛెర్మైన్‌గా బాధ్యతలుచేపట్టారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా కొనసాగిన ఆయన.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛెర్మైన్‌గా కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమం, జూబ్లీహిల్స్ ఆత్మకూరి రామారావు భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌తో పాటు నగరంలోని భారతీయ విద్యాభవన్ స్కూళ్లకు ఇక నుంచి ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు వైస్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.