ప్రపంచంలో రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించే టాప్–5 దేశాల జాబితాలో భారత్ చేరింది. సౌదీఅరేబియా, రష్యాలను మించి 50.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.34 వేల కోట్లు) మిలటరీ బడ్జెట్‌కు కేటాయించినట్లు తాజాగా వెల్లడైంది. రక్షణ రంగంలో అధికంగా ఖర్చుచేసే మొదటి మూడు దేశాల్లో అమెరికా, చైనా, బ్రిటన్ కొనసాగుతున్నాయి. వీటితర్వాత ఎక్కువగా నిధులు వెచ్చించే స్థానంలో భారత్ నిలిచిందని, ఆ తర్వాత సౌదీఅరేబియా, రష్యా ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ‘2016 జేన్స్ రక్షణ బడ్జెట్ల నివేదిక’వెల్లడించింది. దీన్ని ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్’అధ్యయన సంస్థ విడుదల చేసింది.