కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం | Kidnapped Girl found Safe at Vijayawada | Sakshi
Sakshi News home page

Nov 13 2013 9:52 AM | Updated on Mar 21 2024 6:35 PM

విజయవాడలో కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అదృశ్యమైనట్లుగా భావిస్తున్న పాప ఆచూకీ దొరికింది. అయోధ్య నగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి దుర్గా నరేష్ కూతురు శివనాగ నందిని నిన్న అదృశ్యం అయ్యిందంటూ పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం స్కూలుకు వెళ్లిన తమ కూతురు స్కూలు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కనిపించకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శివనాగ నందిని ఆచూకీ కనిపెట్టారు. పోలీసుల సంరక్షణలో ఆమె క్షేమంగా ఉంది. పాప క్షేమంగా ఉందనే సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement