కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై తాను హైదరాబాద్ రాలేదన్నారు. వివిధ శాఖల్లో భద్రత అంశాల పరిశీలనకు వచ్చినట్లు విజయ్ కుమార్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.