ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్ వంశీయుల పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం సత్యాగ్రహ యాత్ర తలపెట్టిన ముద్రగడను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. మా జాతికి పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించినప్పుడు సత్యాగ్రహ యాత్ర గురించి ఆలోచిస్తా అన్నారు. పోలీసుల కవాతులు, కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుని ఘటనలో మా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.
Published Tue, Jan 24 2017 6:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement