ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అనుకున్నది సాధించారు. ఒకవైపు పార్టీపై పూర్తి పట్టు సాధించడమే కాదు.. మరోవైపు తన బాబాయి శివ్‌పాల్ యాదవ్ వర్గానికి గట్టిగా చెక్ కూడా చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి ములాయం అధీనంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తన చేతుల్లోకి తీసుకున్నారు.