నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జనవరి 1, 2017 వరకూ ఓటర్ల జాబితాలో ఉన్నవారికే ఓటు హక్కు కల్పిస్తూ ఈసీ తాజా ఆదేశాలతో టీడీపీకి ఝలక్ ఇచ్చినట్లు అయింది. అలాగే తాజా ఓటర్ల చేరికను పరిగణనలోకి తీసుకోబోమని సీఈసీ స్పష్టం చేసింది. కాగా ఇటీవేల దాదాపు 15వేల మందిని కొత్తగా ఓటర్లగా టీడీపీ చేర్చింది. అయితే టీడీపీ భారీ ప్రణాళికను కేంద్ర ఎన్నికల సంఘం భగ్నం చేసింది. నంద్యాలలో ఈ ఏడాది జనవరి 1 వరకూ సుమారు 2లక్షల 9వేలమంది ఓటర్లు ఉన్నారు.