రెండున్నరేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలంతా ఏపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యకాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం తొలిదశలోనే విజయం సాధించిందని చెప్పారు.