Gadapagadapaku YSR
-
'ప్రజలు ఏపీ ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు'
-
'ప్రజలు ఏపీ ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు'
హైదరాబాద్: రెండున్నరేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలంతా ఏపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యకాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం తొలిదశలోనే విజయం సాధించిందని చెప్పారు. మరో నెల రోజుల తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలోని గడపగడపకు తాము వెళ్లామని, ప్రజల అవసరాలు, వారికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలుసుకున్నామని వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై తీసుకొచ్చిన ప్రజా బ్యాలెట్ ను వారికి పంపిణీ చేశామని చెప్పారు. 40 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నిక్కచ్చిగా పనిచేశారని, తాము తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నీరాజనాలు అందుతున్నాయని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా ఉన్నారని, వారు పూర్తి అసంతృప్తితో రగులుతున్నారని, మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని వివరించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరం సమీక్షలు తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచామని, ఆయన ఇచ్చిన మరికొన్ని సలహాలతో తిరిగి మరో నెల రోజులపాటు విధుల్లోకి వెళుతున్నామని చెప్పారు. -
‘గడప గడపకూ వైఎస్ఆర్’ జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్: గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల టీడీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. వందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. భవిష్యత్తులో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నేను మారిన మనిషిని, ఒక్కసారి చూడమని ప్రాధేయపడితే ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చారని ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాజేంద్రనాథ్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, పి. ప్రసాద్‌రెడ్డి, మండలకన్వీనర్లు ఉత్తమారెడ్డి, చంద్రారెడ్డి, వీరారెడ్డి, రఘునాథరెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నమ్మి మోసపోయామయ్యా..
* డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు * బెల్టు షాపులు ఉండవన్నారు * బాబొస్తే జాబు వస్తుందన్నారు * దుమ్మెత్తిపోసిన మహిళలు, యువత * ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమానికి విశేష స్పందన సాక్షి, రాజమహేంద్రవరం: ‘డ్వాక్రా రుణాలు ఎవ్వరూ కట్టొద్దు. నేను అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తాను. తర్వాత లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాను’. ‘మద్యం అమ్మకాలు తగ్గిస్తాం. బెల్టు షాపులు ఎత్తివేస్తాం.’ ‘ బాబొస్తేనే జాబు వస్తుంది’ అని ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని డ్వాక్రామహిళలు, యువత ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఆయన ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో మీరే చెప్పండంటూ నిర్వహిస్తున్న ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో ముఖ్యమైన 100 వాగ్దానాలతో వైఎస్సార్ సీపీ రూపొందించిన ప్రజాబ్యాలెట్ ను ప్రజలకు ఇచ్చి, నేతలు వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో 11 నియోజకవర్గాల్లో శుక్రవారం ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమం జరిగింది. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడిపూడి చిట్టాబ్బాయి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. పి.గన్నవరం మండలం ఎర్రజెట్టివారిపాలెంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 300 ఇళ్లు తిరిగిన ఆయన వద్ద ఇళ్ల రుణాలు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలేదని, గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. * మండపేట పట్టణం 7వ వార్డులో నియోజకవర్గం కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫించన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన వద్ద వాపోయారు. * జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లిలో కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసులు కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం, ఇళ్ల స్థలాలు, రుణాలు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన దృష్టి తీసుకువచ్చారు. * సామర్లకోట మండలం పవర గ్రామంలో కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవాల లక్ష్మినారాయణ, సీనియర్ కౌన్సిలర్ ఊబా జాన్‌మోజెస్ తదితరులు పాల్గొన్నారు. * కాకినాడ 36వ డివిజన్లో సిటీ కో ఆర్డినేటర్ గుత్తా శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆదిత్యకుమార్, మాజీ కార్పొరేట్లు పాల్గొన్నారు. అర్హతలున్న ఫించన్లు రావడంలేదని, రోజూ మురుగు తొలగించడంలేదని స్థానికులు శశిధర్ దృష్టి తీసుకొచ్చారు. * పిఠాపురం పట్టణం ఒకటి, ముప్పై వార్డుల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. మంచినీటి పథకం పూర్తి చేయకపోవడంతో తాగునీటికి అల్లాడుతున్నామని స్థానికులు వాపోయారు. బెల్టు షాపులతో ఇళ్లు గుల్లవుతున్నాయి... కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విచ్చలవిడిగా బె ల్టుషాపులు నిర్వహిస్తుండడంతో కుటుంబాలు కూలిపోతున్నాయని కన్నబాబు వద్ద మహిళలు వాపోయారు. బెల్టు షాపులు ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులమైనా కనికరంలేదు తాము దివ్యాంగులమైనా పింఛన్లు రావడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని గొంది గ్రామంలో ఇద్దరు దివ్యాంగులు ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, అధైర్య పడొద్దని పర్వత వారికి భరోసా ఇచ్చారు. శంఖవరం మండలం అచ్చంపేట, గొంది, రాజవరం గ్రామాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఎన్ని సార్లు తిరిగినా పింఛన్ పునరుద్ధరించ లేదు ‘గతంలో వికలాంగుల ఫించన్ వచ్చేది. తర్వాత తీసేశారు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా కనికరించలేదు’ అంటూ సీతారామపురానికి చెందిన అంధురాలు వెలుగుబండి అనంతలక్ష్మి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లల గల అనంతలక్ష్మి మూడో సంతానం తర్వాత కంటి చూపును కోల్పోయింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రాగానే తొలగించారని ఆమె వాపోయింది. కోరుకొండలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కార్యక్రమం నిర్విహ ంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాన్ని కట్టెలపొయ్యిపై సిద్ధం చేయాల్సి వస్తోందని, దాంతో తాము అనారోగ్యం పాలవుతున్నామని మహిళలు విజయలక్ష్మి వద్ద వాపోయారు. పేదలకు వైద్యం దూరం చేశారు కొత్తపేట మండలం మందపల్లి, కొత్తపేట శివారు ఏనుగుల మహల్ గ్రామాల్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఫించన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేద, సామాన్య ప్రజానీకానికి అన్ని రోగాలకు కార్పొరేట్ వైద్యం అందించగా దానిని టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మార్చి కొన్నింటికే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వంద వైఫల్యాలపై ఏం చెబుదాం?
* తెలుగుదేశంలో ‘గడపగడప’ కలవరం.. * చంద్రబాబు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలు.. ఆర్భాటంగా చేసిన ఐదు సంతకాలు హుష్‌కాకి.. హామీలన్నీ గాలికి... వీటన్నిటికి తోడు విచ్చలవిడి అవినీతి.. ఇదే సమయంలో వీటన్నిటినీ ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ‘గడపగడపకు వైఎస్సార్’ నినాదంతో భారీ కార్యక్రమం చేపట్టడం అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. దాంతో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. గుంటూరుజిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గురువారంనాడు ఈ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై వంద ప్రశ్నలను తాము ప్రజల్లోకి తీసుకెళతామని వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రశ్నల వివరాలు సేకరించి వాటికి సమాధానాలు ఇచ్చేలా నేతలు సిద్ధంగా కావాలని చంద్రబాబు సూచిం చారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయి నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయామనే విషయాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రస్తావించగా చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైనట్లు సమాచారం. మీరే ఇలా అంటే కిందిస్థాయి నేతలు ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏం చెప్పాలో మీరే చెప్పండి... ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామన్న ఒక్క వాగ్దానాన్నే అమలుచేశామని... అదికూడా వెనువెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదనే కారణంతో అమలు చేశాం తప్ప అంతకంటే ఏం చేయలేదని నేతలు చెప్పినట్లు తెలిసింది. దీన్ని ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల వారికి అమలు చేయలేదనే అంశాన్ని ప్రస్తావించిన నేతలు ప్రజలకు, వైఎస్సార్సీపీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో మీరే చెప్పండని అడిగినట్లు తెలిసింది. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా రుణాల మాఫీ వంటివి కూడా సమగ్రంగా అమలు చేయలేదని, ఇవి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చేసిన తొలి ఐదు సంతకాల్లో ఉన్నాయని నేతలు ప్రస్తావించారు. ఇటువంటి వాటి విషయంలో తాము ప్రజలకు ఏం చెప్పాలో తెలియటం లేదని కూడా వారు అన్నట్లు తెలిసింది. అల్లరి చేసే యోచన... టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో వైఎస్సార్సీపీని ప్రవేశించనివ్వకుండా అడ్డుకుని గడపగడపకూ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయాలని నేతలకు బాబు సూచించినట్లు తెలిసింది. దీని వల్ల ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని, దాన్ని ఆసరాగా తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట వైఎస్సార్ సీపీ నేతలను కట్టడి చేయవచ్చని అన్నట్లు సమాచారం. ముద్రగడ దీక్ష సమయంలో సాక్షి ఛానల్ ప్రసారాలను ఆపిన ట్లే వైఎస్సార్సీపీ కార్యక్రమం జరిగే సమయంలో ఏదో ఒక మిషతో ఆ ఛానల్ ప్రసారాలను నిలువరించాలని, పత్రికపై కూడా కేసులు నమోదు చేయటం ద్వారా అడ్డంకులు సృష్టించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయంతో పాటు నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సీనియర్ మంత్రులు, నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. గవర్నర్‌తో తాను జరిపిన చర్చల సారాంశాన్ని వివరించిన బాబు... నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించానని, దానిని సరైన సమయంలో వెల్లడిస్తానని, సరిగా పనిచేయని వారిపై చర్యలుంటాయన్నారు. ఆర్డీఓ, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలను రష్యా పర్యటన తర్వాత చేపడతానని చెప్పారు. నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తానని తెలిపారు.