'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు' | Pervez Musharraf reveals that Raheel Sharif helps him a lot | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 21 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

కష్టకాలంలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తనకు ఎంతో సాయం చేశారని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. రహీల్ షరీఫ్ వల్లే తాను దేశం నుంచి సురక్షితంగా బయడపడగలిగానని ఓ మీడియా టాక్ షో సందర్భంగా వెల్లడించారు. కోర్టులు, ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తగ్గించి, తనకు అండగా నిలబడ్డారని కొనియాడారు. షరీఫ్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టకముందు తాను ఆ పదవిలో కొనసాగానని, ఆ సమయంలో అతడికి తాను బాస్‌గా వ్యవహరించానని ముషార్రఫ్ గుర్తుచేసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement