ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందన్నారు. పేదలు, రైతులు, కష్ట జీవులపై ఇది బాంబు దాడిలాంటిదన్నారు. దేశాన్ని పేద–ధనిక వర్గాలుగా విభజించిందని శనివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర పర్యాటక, ఉద్యాన, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపించడం ద్వారా హిమాచల్ ప్రదేశ్ టోపీని తొలగించింది. ఇక్కడి సాగు భూములను చిరునవ్వుతో మోదీ తగులబెట్టారు. ఇది నల్లధనం, అవినీతిపై లక్షిత దాడి కాదు. పేదలు, రైతులు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థపై బాంబు దాడి.