శ్రీలంక ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే(66) మరోసారి ప్రధాని పీఠం అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 106 స్థానాలు గెలుచుకుంది. 225 స్థానాల పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. తమిళ పార్టీల మద్దతుతో విక్రమసింఘే మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. మాజీ అధ్యక్షుడు, ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్న మహీంద రాజపక్స తుది ఫలితాలు వెలువడకముందే ఓటమి అంగీకరించారు.
Published Wed, Aug 19 2015 10:33 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement