ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగానే దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కోసం ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రణాళికలు వెల్లడించారు. దేశంలో మహిళలు, ఉద్యోగినులు, పేదలు, బాగుపడినపుడే దేశం బాగుపడిందని ప్రకటించిన ప్రధాని గర్భవతులకు శుభవార్త అందించారు.