కొన్ని పత్రికలు అనవసరమైన రాతలు రాస్తున్నాయని, అయితే ప్రజల ఆరోగ్యం కోసం సాక్షి మీడియా లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్ హైటెక్స్లో సాక్షి ది 'లివ్ వెల్ ఎక్స్పో' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన లివ్ వెల్ ఎక్స్ప్రోను చేపట్టిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతిరోజై ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించాల్సిందేనని, వాటిని పాటిస్తే రోగాలు రాకుండా ఉంటాయన్నారు.