ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మత్స్య, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఇక్కడ తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన డిమాండ్ చేశారు