టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన భూ సేకరణ బిల్లుపై కాంగ్రెస్ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అసెంబ్లీలో పెట్టింది భూ సేకరణ చట్టానికి సవరణా? లేదా కొత్త చట్టం తీసుకువచ్చారా అనే దానిపై ఎక్కడా స్పష్టత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డీకే అరుణ, రామ్మోహన్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ సాంప్రదాయాల ను, నిబంధనలను అమలు చేయకుండా స్పీక ర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా రని, ఇది శాసనసభకు బ్లాక్‌డే అని ఉత్తమ్ అన్నారు