ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న అందరు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన పీసీసీ కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం సీరియస్గా కసరత్తు చేస్తుందని ఆయన తెలిపారు.