చిన్నారి రమ్యకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా అశ్రునివాళి అర్పించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేబీఆర్ పార్కు వద్ద సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్ రోడ్ నం.3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే