ట్రయల్ రన్ అని చెప్పి ఖరీదైన హార్లేడేవిడ్సన్ బైక్ తో ఉడాయించాడో ఘనుడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే .. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లే డేవిడ్సన్ షోరూంకు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టిప్‌టాప్ డ్రెస్‌తో హీరోలా ఉన్న ఓ యువకుడు(25) వచ్చాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, నెలకు లక్షన్నర వేతనం ఉంటుందని బడాయిలు చెప్పుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని నమ్మబలికాడు. పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు.