కొత్త అసెంబ్లీకి మకిలి అంటకుండా చూడండి | YS Jagan letter to the Legislative Assembly Speaker | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2017 6:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తమ పార్టీ నుంచి వందల కోట్ల రూపాయలు వెచ్చించి టీడీపీలో చేర్చు కున్న ఎమ్మెల్యేలతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న ఈ శుభ సమ యంలో దొంగిలించిన ఎమ్మెల్యేలను తీసు కెళ్లడం ఏమిటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇలా దొంగ సొత్తుతో చంద్రబాబు అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించాల్సిన బాధ్యత స్పీకర్‌ చేతుల్లోనే ఉందని అన్నారు. జగన్‌ సోమవారం ఈ మేరకు ఏపీ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు ఒక ఘాటైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, ఆదిమూలపు సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement