బిగ్‌బాస్ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకలేకుండా చేస్తుంది. అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు భిన్నంగా మార్పులు కనిపిస్తాయి. అయితే అక్కడ ఇది నిరంతరం ప్రక్రియ. ప్రతీవారం నామినేషన్‌కు వెళ్లడం.. అదృష్టం ఉంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారు లేదా నిష్క్రమిస్తారు. అయితే ఎలాంటి తప్పు చేయకుండా, నామినేషన్‌లో సరైన కారణాలు చెప్పకుండా నామినేట్ అయితే వారు మరింత బాధపడుతూ ఉంటారు.