బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రెటీలు సైతం బిగ్‌బాస్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నచ్చిన కంటెస్టెంట్ల తరుపున మద్దతును ప్రకటిస్తారు. ఇప్పటికే పలు సీరియల్ యాక్టర్స్ కొంతమంది కంటెస్టెంట్ల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా యాంకర్ రవి.. తనకు ఇష్టమైన కంటెస్టెంట్ల పేర్లను చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా శ్రీముఖికి సెటైర్లు పడుతున్నాయి.