వివాహ ఆహ్వాన పత్రికను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న తప్పులు కొట్టొచిన్నట్లు కనిపిస్తున్నాయి. అలియా భట్ తండ్రి పేరు వాస్తవానికి మహేష్ భట్ అయితే, ఆహ్వాన పత్రికలో మాత్రం ముఖేష్ భట్ అని తప్పుగా ఉంది. అంతేకాక అలియా భట్ పేరుతో పాటు తేదిలో కూడా అక్షర దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అలియా చిరునవ్వుతో కొట్టి పారేయడంతో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని తేలింది.