పోలవరం హెడ్‌వర్క్స్ (జలాశయం) పనులకు మరోసారి రెక్కలొస్తున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, పాత కాంట్రాక్టర్‌తోనే పనులు చేయించాలని చెప్పినా ఖాతరు చేయకుండా కేబినెట్ సిఫార్సు పేరుతో హెడ్‌వర్క్స్ పనుల్లో కాంక్రీట్ పనులు (స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్) పనులను అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాధరల ప్రకారం పనులు అప్పగిస్తే రాష్ట్ర ఖజానాపై రూ.2000 కోట్లు భారం పడనున్నప్పటికీ కేబినెట్ తీర్మానం ద్వారా ఆ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్ణయిం చారు. భారీ మొత్తంలో కమీషన్లు పొందేందుకే 60సీ నిబంధనను తెరపైకి తెస్తున్నారని తెలుస్తోంది. పాత కాం ట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ యజమాని రాయపాటి సాంబశివరావు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో అతను సరిగా పనులు చేయలేకపోయినా ఇన్నేళ్లూ తప్పించలేకపోయారు.