Concrete works
-
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులేవి?
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింకు–1 బ్యారేజీల వద్ద గత ఏడాది వచ్చిన భారీ వరదలతో కాంక్రీటు దెబ్బతింది. అయితే మళ్లీ వానాకాలం వచ్చినప్పటికీ దెబ్బతిన్న చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ, అన్నారంలోని (సరస్వతి) బ్యారేజీల వద్ద వరద తాకిడికి గేట్ల ముందు భాగంలోని కాంక్రీటు దిమ్మెలు కొట్టుకుపోయాయి. గత సీజన్లో ఇది జరిగితే ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతుల విషయంలో ఆలోచన చేయడం లేదని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నా పనుల్లో జాప్యం చేస్తున్నారని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. గతేడాది ఉధృతంగా వరద గత ఏడాది కురిసిన భారీవర్షాలకు బ్యారేజీలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎగువ గోదావరి నుంచి సరస్వతీ బ్యారేజీ వద్ద 17.50 లక్షల క్యూసెక్కుల వరద జూలై 14–15 తేదీల్లో ఉధృతంగా ప్రవహించింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతికి గేట్ల కింది భాగాన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు లేచిపోయాయి. అలాగే గోదావరి వరదకు, ప్రాణహిత వరద తోడై మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద 29 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో దిమ్మెలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. కాంక్రీటు దిమ్మెలు ఇలా.. బ్యారేజీల్లో గేట్లు ఎత్తినప్పుడు వరద తాకిడికి నేల కోతకు గురికాకుండా ముందు భాగంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీటు దిమ్మెలను అమర్చారు. 3 అడుగుల వెడల్పు, పొడవుతో దిమ్మెలను బ్యారేజీ పొడవునా గేట్ల కింద ముందు భాగంలో కాంక్రీటు చేశారు. వరద తాకి డి కి నేల కోతకు గురికాకుండా ఈ దిమ్మెలు అడ్డుకుంటాయి. కానీ గత ఏడాది వచ్చిన భారీ వరద తాకిడికి ఈ దిమ్మెలు విరిగి ఎక్కడికక్కడ చెల్లాచె దురుగా పడి కొట్టుకుపోయాయి. అప్పటి నుంచీ అక్కడ మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు. డిజైన్స్ రాలేదని.. మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల వద్ద అమర్చిన దిమ్మెలు కొట్టుకుపోయి ఏడాది కావస్తున్నా.. డిజైన్స్ తయారు చేయలేదని ఇంజనీ రింగ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరమ్మ తులు చేయకుండానే మళ్లీ వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీల గేట్లు ఎత్తితే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే గేట్ల ముందుభాగంలో కోతకు గురై, భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. -
నేటి నుంచి పులిచింతల గేటు అమర్చే పనులు
అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్ట్‌కు అమర్చిన 16వ నంబరు రేడియల్ గేటు 2021 ఆగస్ట్ 5న కృష్ణా నది వరదలకు కొట్టుకుపోగా.. కొత్త గేటు అమర్చే పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గేటు కొట్టుకుపోయిన నాటినుంచి ఇప్పటివరకు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌తో 16వ నంబర్ గేటును బ్లాక్‌చేసి ప్రాజెక్ట్‌లో సాగునీటిని నింపుతూ వచ్చారు. కాగా.. కొత్తగేటును అమర్చేందుకు ప్రభుత్వం రూ.22.05 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.7.53 కోట్లతో రేడియల్ గేటు తయారీ, రూ.1.73 కోట్లతో కాంక్రీట్ పనులు, రూ.9.57 కోట్లతో అన్ని గేట్లను క్రమబద్ధీకరించే పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ.3.20 కోట్లతో నడక దారిని ఏర్పాటు చేయాలి. ఆయా పనులు రెండు నెలలుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంక్రీట్, గడ్డర్స్, ఆమ్స్, స్కిన్ప్లేట్స్ పనులను పూర్తి చేశారు. కొత్త రేడియల్ గేటును ప్రాజెక్ట్‌కు అమర్చాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి 16 వరకు 16వ నంబర్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేత పనులకు అంతరాయం ఏర్పడకుండా ప్రాజెక్ట్ మీదుగా మంగళవారం నుంచి 15 రోజులపాటు రాకపోకలను నిలిపివేశారు. రేడియల్ గేటు పైభాగంలో కోల్తార్ పెయింట్స్ వేసి రబ్బరు సీల్స్ బిగించి, గ్రీజింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన వెంటనే రేడియల్ గేట్‌ను ప్రాజెక్ట్‌కు బిగించేందుకు 100 టన్నుల క్రాలర్ హెవీలోడ్ క్రేన్, 80 టన్నుల టైర్మౌంటెడ్ క్రేన్లను సిద్ధం చేశారు. పనులను సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అరుణకుమారి, అసిస్టెంట్ ఇంజినీర్లు విక్రమ్, వెంకటరెడ్డి పర్యవేక్షించనున్నారు. -
తండ్రి సంకల్పం.. తనయుడి పరిపూర్ణం
దశాబ్దానికి పైగా నత్తనడకలు నడిచిన సంగం బ్యారేజీ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. దివంగత వైఎస్సార్ సంకల్పించిన ఆనకట్ట పనులను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపూర్ణం చేయనున్నారు. వరుసగా మూడేళ్లుగా తరచూ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా పెన్నమ్మ పరుగులు పెడుతోంది. ఫలితంగా పనుల నిర్వహణకు కొంత ఆటంకం ఏర్పడినా.. ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ జనవరి ఆఖరి నాటికి ప్రజలకు అంకితం కానుంది. సాక్షి, సంగం (నెల్లూరు): బ్రిటిష్ కాలంలో పెన్నానదిపై నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో అత్యాధునిక బ్యారేజీ నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన హయాంలోనే ఎర్త్ వర్క్‌లు, ఇతర మేజర్ పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణంతో నత్తనడకన పనులు సాగాయి. బ్యారేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతాంగం ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి సంకల్పించిన జలవనరుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా సంగం ఆనకట్ట పనులకు నిధులు కేటాయించి, పెండింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సంగం బ్యారేజ్ వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్న దృశ్యం ఆనందంలో అన్నదాతలు నూతన సంగం ఆనకట్ట నిర్మాణం కాంక్రీట్ పనులు పూర్తవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 3.85 లక్షల ఎకరాల సాగుకు స్థిరీకరణ జరుగుతుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్ట నిర్మాణం వల్ల 0.45 టీఎంసీల నీరు సంగం వద్ద నిల్వ ఉంటుందని, దీని వల్ల సంగం చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పెరిగి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. రాకపోకల సమస్యలు పరిష్కారం పాత సంగం ఆనకట్ట దెబ్బతినడంతో వర్షాలు వచ్చిన ప్రతి సారి సంగం ఆనకట్టపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంగం పెన్న అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసరాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. నీటి ప్రవాహంలో ఆనకట్టను దాటుతూ ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నూతన ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తవుతుండడంతో రాకపోకల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ ఆనకట్ట రోడ్ లెవల్ 40.96 మీటర్లు ఉండడం వల్ల రాకపోకలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోడ్డు ఉపయోగంలోకి వచ్చేందుకు కొంచెం మట్టి పనులు మాత్రమే పెండింగ్ ఉంది. పక్షం రోజుల్లో మట్టి పనులు పూర్తయి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పూర్తయిన కాంక్రీట్ పనులు సంగం నూతన ఆనకట్ట నిర్మాణంలో భాగంగా 1,88,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. 1,195 మీటర్ల ఆనకట్ట పొడవుతో 79 క్లిప్‌వే గేట్లు కుడి వైపు నుంచి ఎడమ వైపు మూడు స్లూయిజ్ గేట్లు నిర్మాణం పూర్తి కావడంతో వాటికి గేట్లను అమరుస్తున్నారు. దీంతో కాంక్రీట్ పనులు మొత్తం పూర్తయినట్లు నిర్మాణ ఇంజినీరింగ్ సంస్థ ప్రకటించింది. జనవరి నెలాఖరుకు పూర్తి పెన్నానదిలో నిర్మిస్తున్న బ్యారేజ్ నిర్మాణ కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నవంబర్ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. అప్రోజ్ రోడ్డు, రెగ్యులేటర్ నిర్మాణం, పైలాన్, మరో చిన్న పార్కు నిర్మాణ పనులను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందిస్తాం. చేజర్ల, పొదలకూరు మండలాలకు సైతం రాకపోకలు పూర్తిస్థాయిలో బ్యారేజీపైనే కొనసాగుతాయి. – రమేష్‌బాబు, ఈఈ, సంగం బ్యారేజీ -
ఎస్సారెస్పీ ‘పునరుజ్జీవం’
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. జూన్‌లో ఆయకట్టుకు నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం పనులను వేగిరం చేశారు. 2017 ఆగస్టు నెలలో ఆరంభించగా మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో ఇప్పటికే 30.98 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో 29.60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో కాంక్రీట్ పనులు మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. 5.10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిలో కేవలం 3.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. మరో 2 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉంది. ఈ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత ఏజెన్సీపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవలే 200 మంది కార్మికులను అదనంగా నియమించి ఈ పనుల్లో వేగం పెంచారు. ఇక ఈ పథకానికి సంబంధించి మూడు పంప్‌హౌస్‌ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం కానున్నాయి. మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 24 పంపులకు గానూ 15 పంపులు, 24 మోటార్లకు గానూ 10 మోటార్లు మాత్రమే కొనుగోలు చేశారు. రోజుకు ఒక టీఎంసీ.. వచ్చే మే నాటికి 2 పంప్‌హౌస్‌లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రచించారు. ప్రస్తుతం 10 మోటార్లే ఉండగా వచ్చే జనవరి చివరికి మరో 6 పంపులు విదేశాల నుంచి రానున్నాయి. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించగా, అందుకనుగుణంగా కనిష్టంగా 50 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసే వ్యూహంతో పనులు చేస్తున్నారు. అనుకున్న మేర నీటిని ఎత్తిపోసినా ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలలో పనులన్నీ పూర్తి చేసి జూన్ నుంచే ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి 50 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు. -
కాళేశ్వరం కాంక్రీట్ పనుల్లో రికార్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనుల్లో వేగం పెరిగింది. గత కొన్ని నెలలుగా మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో సగటున 1,169 క్యూబిక్ మీటర్ల మేర పనులు జరగ్గా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్ 7న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన సమయానికి 77,946 క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయని... ప్రస్తుతం నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగినట్లు నీటిపారుదలశాఖ వెల్లడించింది. కాంక్రీట్ పనుల్లో వేగం పెరగడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ సంస్థ, ఇరిగేషన్ యంత్రాంగాన్ని ఆదివారం ఓ ప్రకటనలో అభినందించారు. ఇదే పట్టుదల, వేగాన్ని కొనసాగించాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు, ఇతర ప్రభుత్వశాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమష్టిగా పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అతితక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణం....ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను చరిత్రలో తిరగరాస్తుందన్నారు. -
2000 కోట్ల భారం
-
2000 కోట్ల భారం
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్ (జలాశయం) పనులకు మరోసారి రెక్కలొస్తున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, పాత కాంట్రాక్టర్‌తోనే పనులు చేయించాలని చెప్పినా ఖాతరు చేయకుండా కేబినెట్ సిఫార్సు పేరుతో హెడ్‌వర్క్స్ పనుల్లో కాంక్రీట్ పనులు (స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్) పనులను అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాధరల ప్రకారం పనులు అప్పగిస్తే రాష్ట్ర ఖజానాపై రూ.2000 కోట్లు భారం పడనున్నప్పటికీ కేబినెట్ తీర్మానం ద్వారా ఆ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్ణయిం చారు. భారీ మొత్తంలో కమీషన్లు పొందేందుకే 60సీ నిబంధనను తెరపైకి తెస్తున్నారని తెలుస్తోంది. పాత కాం ట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ యజమాని రాయపాటి సాంబశివరావు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో అతను సరిగా పనులు చేయలేకపోయినా ఇన్నేళ్లూ తప్పించలేకపోయారు. మరోవైపు అతని నుంచి రావాల్సిన కమీషన్లు ఇప్పటికే వచ్చేసిన నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ను అలాగే కొనసాగిస్తూ, కాంక్రీట్ పనులను పెంచిన ధరలతో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం ద్వారా సరికొత్త కమీషన్లు పొందేందుకు వ్యూహం రచించారని తెలుస్తోంది. పోలవరం కాంక్రీట్ పనుల్లో కదలిక కనిపించకపోవడంతో ఆ పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి పెంచిన ధరల ప్రకారం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను జలవనరుల శాఖ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈ నెల 25న కేంద్ర జలనవరుల శాఖ మంత్రి గడ్కరీని కలిసి వివరించారు. అదనపు భారం పడే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం స్పిల్‌వేలో మిగిలిన 9.12 లక్షల క్యూబిక్ మీటర్లు, స్టిల్టింగ్ బేసిన్లో 3.49 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానల్లో 18 లక్షల క్యూబిక్ మీటర్లు వెరసి 30.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు పెంచిన ధరల మేరకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనుల విలువ 2015–16 అంచనా ప్రకారం రూ.2928.51 కోట్లు. పెంచిన ధరల ప్రకారం ఈ పనుల విలువు సుమారు రూ.5000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే రాష్ర ఖజానాపై కనీసం రూ.రెండు వేల కోట్ల భారం పడుతుంది. కేంద్రానికి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించి ఉంటే ఈ భారం పడేది కాదని, కేవలం భారీ కమీషన్ల కోసమే రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం మోపుతున్నారని జలవనరుల శాఖ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే అదనపు బిల్లులు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–ఈసీ–యూఇఎస్ (జేవీ) రూ.4,154 కోట్లకు 2013లో దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం మార్చి 3, 2018 నాటికి పనులను పూర్తి చేయాలి. పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, లేని ప్యాకేజీ కింద ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ఆ తర్వాత ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్కు లబ్ధి చేకూరేలా వ్యవహరించింది. ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని మట్టిపనులను త్రివేణి, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ– బావర్, కాపర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులను కెల్లర్, కాంక్రీట్ పనులను పెంటా, ఫూడ్‌జమీస్టర్, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించింది. ఈ వ్యవహారంలో ‘ముఖ్య’నేత కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒప్పందం గడువు ముంచుకువస్తున్నా హెడ్‌వర్క్స్ పనుల్లో కదలిక లేకపోవడాన్ని నిలదీస్తూ గత జూలై 12న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేగింది. 10.55 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 7.59 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 2.96 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని మిగిలి ఉంది. 34.04 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 3.43 కోట్ల క్యూబిక్ మీటర్ల పనే జరిగింది. ఇంకా 30.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉంది. కాంక్రీట్ పనుల్లో కదలిక కనిపించకపోవడంతో ఆ పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి తాజా ధరల ప్రకారం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తోసిపుచ్చారు. టెండర్ ఒప్పందం మార్చి 3, 2018 వరకు ఉందని, ఆలోగా అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినా ఇప్పటికే రూ.1481.41 కోట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే జీవో 22, జీవో 63 మేరకు అదనపు బిల్లులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు మళ్ళీ అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. దాంతో యధాప్రకారం ఈ ప్రతిపాదనపై కేబినెట్లో ఆమోదముద్ర వేసి కాంక్రీట్ పనులను తాను ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించి కమీషన్లు రాబట్టుకోవడానికి సీఎం చంద్రబాబు పావులు కదిపారు. ఇప్పటివరకు హెడ్‌వర్క్స్ పనులకు రూ.2,493 కోట్లను బిల్లులుగా చెల్లించగా.. ఇందులో మట్టిపనులకు చెల్లించిన బిల్లులే రూ.1,500 కోట్లు కావడం గమనార్హం. -
పొగడ్తలు.. పాదాభివందనాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అపర భగీరథుడు.. అభినవ కాటన్.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే జనం దృష్టిలో దేవుడు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకు పాదాభివందనం చేయడానికీ పోటీపడ్డారు. మంత్రి రావెల కిషోర్‌బాబు అయితే ఓ కవిత రాయించి గాయనితో పాడించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో స్పిల్ వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీనికి ముందు సుదర్శన, వాస్తు హోమాలు నిర్వహించి.. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచింగ్ ప్లాంట్ (కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్)ను ప్రారంభించారు. ఆ తరువాత స్పిల్‌వే వద్ద పూజలు చేసి కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరిఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏడు ముంపు మండలాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమవుతుందని భావిం చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ఆ మండలాలను ఏపీలో విలీనం చేయించానని బాబు చెప్పారు. ఈ మండలాలను విలీనం చేయకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కూడా ప్రధాని వద్ద చెప్పానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని స్పందించి ఏడు మండలాలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఇది తన ఘనతేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కొత్త భూసేకరణ చట్టం వర్తింపునకు చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఆ ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. జనవరి 7, 14వ తేదీల్లో ఇక్కడకు వచ్చి ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రమ్‌వాల్, గేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ కోసం సహకరించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి అందరినీ పేరుపేరునా సభకు పరిచయం చేశారు. పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనులను పండగలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. 680 బస్సుల్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్‌కు ప్రజల్ని తరలించారు. ఇందుకోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ బస్సులను తీసుకొచ్చారు. సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే పసుపు కుంకుమ సొమ్ము రూ.3 వేలు ఆగిపోతాయని గోపాలపురం మండల టీడీపీ కార్యకర్తలు మహిళలను బెదిరించి బస్సులు ఎక్కించగా, నల్లజర్ల మండలంలో సభకు రాని మహిళలకు రూ.300 చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. ఆచంట నుంచి 78 స్కూల్ బస్సుల్లో మహిళల్ని తీసుకొచ్చారు. సభకు రాకపోతే సోపానం ఇంటర్వూ్యల్లో లబ్ధిదారులను పక్కన పెడతారని, కొత్త ఇళ్లు మంజూరు చేయరని, డ్వాక్రా గూపు సభ్యులకు రుణాలు మంజూరు చేయరని అధికారులు ప్రచారం చేసి మహిళలను, వివిధ పథకాల లబ్ధిదారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. నరసాపురం, సమీప గ్రామాల నుంచి ప్రైవేట్ కళాశాలలకు చెందిన బస్సులలో జనాన్ని తీసుకెళ్లారు. ఈ ప్రాంతం నుంచి మహిళలు తక్కువ సంఖ్యలోనే వెళ్లారు. మనిషికి రూ.300 వరకూ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రసంగాలు మూడు గంటలకు పైగా సాగడంతో జనమంతా మధ్యలోనే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రతిజ్ఞ చేయించే సమయానికి సభాస్థలిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు మాత్రమే మిగిలారు. పొరుగు జిల్లాల నుంచీ జనం తరలింపు పోలవరం/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలను తరలించారు. కొవ్వూరు నుంచి పోలవరం వరకు ఏటిగట్టు రోడ్డు సింగిల్ లేన్ కావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గూటాల సమీపంలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కొత్త పట్టిసీమ నుంచి గూటాల వరకు బస్సులను మళ్లించారు. పోలవరం నుంచి తాళ్లపూడి మార్గంలో ఆర్టీసీ బస్సులు నడపకపోగా, ఆటోల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని ఎత్తైన ఘాట్ రోడ్లపైకి బస్సులు వెళ్లేందుకు మలుపుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సభకు వచ్చిన జనం భయాందోళనకు లోనయ్యారు. సభ ముగిసిన తరువాత వాహనాలన్నిటినీ ఒకే మార్గంలో మళ్లించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. సభా ప్రాంగణానికి వెళుతున్న మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనను చూసి పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. -
సాగర్ పనులు సాగదీత!
► కొలిక్కిరాని కాల్వల ఆధునికీకరణ ► రూ. కోట్ల నిధులు మట్టిపాలు ► నేటికీ ప్రారంభంకాని కాంక్రీట్ పనులు ప్రపంచ బ్యాంక్ నిధుల ద్వారా చేపట్టిన నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు ఎన్నాళ్లు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కెనాల్స్ మరమ్మతుల కోసం కేటాయించిన వందల కోట్ల రూపాయల నిధులు మట్టిపాలవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. కాల్వల్లో పూడిక మట్టి తీసి దానినే కట్టలు సరిజేసేందుకు వినియోగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ మట్టి కట్టలు తిరిగి కాల్వలోకి పడిపోతున్నాయని చెబుతున్నారు. సక్రమంగా పనులు చేయకపోవడంతో చివరి భూములకు నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆచరణలో ఆ విధంగా అయ్యేలా కనిపించడం లేదు. క్రోసూరు : క్రోసూరు సబ్‌డివిజన్ పరిధిలోని సాగర్ కాల్వల ఆధునికీకరణకు రూ.53.99 కోట్ల పనులు మంజూరు చే శారు. 2008 లో చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నిధులు వినియోగిస్తున్నా ఆ స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని రైతులంటున్నారు. ఏటా పొలాలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తూతూ మంత్రంగా మట్టి పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ క్రోసూరు సబ్‌డివిజన్ పరిధిలో బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట మండలాలున్నాయి. వీటిలో బెల్లంకొండ డిస్ట్రిబ్యూటరీ నెంబర్ -7, క్రోసూరు డిస్ట్రిబ్యూటరీ నెంబర్ -8, అచ్చంపేట డిస్ట్రిబ్యూటరీ నెంబర్-9 గా ఉన్నవాటి కాలువపనులతో పాటు, తిరిగి వాటి కింద(వాటర్ యూజర్ సంఘాల) ఉపభాగాలు విభజించి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్యూజర్ సంఘం పనులు జరుగుతున్నాయని కెనాల్స్ డీఈ వీరయ్య తెలిపారు. చేపట్టాల్సిన పనులు... సబ్ డివిజన్ పరిధిలో కెనాల్స్ మట్టి పనులు, తూముల పటిష్టం, డ్రాపులు, వంతెనల నిర్మాణం, యూటీలు, సైఫన్లు, షెట్టర్లు, కాంక్రీటు పనులు చేపట్టాలి. కాల్వల్లో మట్టి తీసి దానినే తిరిగి కట్టల పటిష్టం పేరుతో అలంకరించారని వాపోతున్నారు. యర్రబాలెం మేజరు కింద 22 కిలోమీటర్లు, రాజుపాలెం కింద 13 కిలోమీటర్లు, చింతపల్లి మేజరు 15 కిలోమీటర్లు, కస్తలమైనర్ 25 కిలోమీటర్లు, చామర్రు 25 కిలోమీటర్లు పనులు నిర్వహించాలి. ఇప్పటివరకు చేసిన పనులు ... బెల్లంకొండ డీసీ కింద రూ. 16.99 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.11 కోట్ల మేర పనులు చేశారు. ఇంకా కాంక్రీటు పనులు పెండింగ్ ఉన్నాయి. క్రోసూరు డీసీ కింద రూ.8.8 కోట్లు పనులు చేయాల్సి ఉండగా రూ.7.8 కోట్ల వరకు చేశారు. చామర్రు డీసీ కింద రూ.6.8 కోట్లు మేర చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఈ మూడు డీసీల కింద రూ.32.59 కోట్లు విలువ చేసే పనులు చేయాల్సి ఉండగా రూ.18.8 కోట్ల వరకు చేశామని అధికారులు అంటున్నారు. డీసీల కింద పనులు... బెల్లంకొండ సంఘం కింద ఉన్నది 10 స్లైసెస్. దీనికి సంబంధించి చేయాల్సిన పనులు రూ. 15 కోట్ల అయితే రూ.10.6 కోట్లు మాత్రమే చేశారు. క్రోసూరు వాటర్ యూజర్ సంఘం కింద పనులు ప్రారంభం కాలేదు. చామర్రు వాటర్ యూజర్ సంఘం (5 స్లైయిసెస్) కింద రూ. 6.40 కోట్లకు రూ.4.60 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. మూడేళ్లుగా వేగంగా చేస్తున్నాం ... 2008 నుంచి 2012 వరకు ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగినప్పటికీ మూడేళ్లుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వర్షాకాలానికీ దాదాపుగా పూర్తిచేస్తాం. కొన్ని పనులుపెండింగ్లో ఉన్నా ప్రభుత్వం గడువు పెంచుతుందని భావిస్తున్నాం. -కెనాల్స్ డీఈ, వీరయ్య.