రాష్ట్రంలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ బొనాంజా అందించబోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేసిన పోలీస్ శాఖ.. మరో 3,897 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 18 వేల పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దఫాలో 3,897 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ సోమవారం జీవో జారీ చేసింది.