చంద్రబాబుకు వారి పార్టీలోని వారిపైనే నమ్మకంలేదని, అందువల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మాటని, ప్రాణాన్ని ఒక్కటిగా భావిస్తారన్నారు. చంద్రగిరిలో నీటి కష్టాలు తీర్చడమే తమ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే చంద్రగిరి ప్రజలకు అండగా ఉంటామన్నారు.