పసుపు-కుంకుమ కార్యక‍్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. వేదాంతపురం అగ్రహారంలో ఏర్పాటు చేసిన సభలో చెవిరెడ్డి మాట్లాడుతుండగా పలువురు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో వేదిక వద్దే చెవిరెడ్డి స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో గాయపడిన చెవిరెడ్డిని రుయా ఆస్పత్రికి తరలించారు.