నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుని రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించకపోగా, దానిని శాయ శక్తులా నిర్వీర్యం చేసి... హోదా కోసం ప్రజలే పోరాడుతున్న దశలో అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని తనే హోదా చాంపియన్ అని నిరూపించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న విన్యాసాలను మనం రోజూ చూస్తున్నాం..