రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్‌సింగ్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.