ఐఏఎస్ అధికారులు దాచుకోవడానికి కూడా వీలు లేని కీలకమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమగ్ర సమాచారం ఐటీ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టీడీపీ సామాన్య కార్యకర్త మొబైల్‌లో కూడా ప్రత్యక్షం కావడం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న వాస్తవం క్రమంగా వెలుగులోకి వస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాతోపాటు మంత్రి హోదాలోనూ ఉన్న సీఎం తనయుడు నారా లోకేష్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో తమ పార్టీకి ఉపయోగపడేలా ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా లోకేష్ ఓ విశ్లేషణ తయారు చేయించారు.