వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల నడుమ పిప్పర శివారు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం అగ్రహారపు గోపవరం, ముగ్గళ్ల క్రాస్, అర్థవరం, వరదరాజ పురం, గొల్లదిబ్బ, గణపవరం మీదుగా సరిపల్లి వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.