ఎండ చండప్రచండమై మండుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు వాహనాలు కూడా నిప్పుల్లో కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం వద్ద ఆమనగల్ నుంచి షాద్‌నగర్ వైపు అట్టల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిండా అట్టలు ఉండటంతో క్షణాల్లో మంటలు వాహనమంతా వ్యాపించాయి.