కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ముంబైలో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన డీకే శివకుమార్‌కు చుక‍్కెదురు అయింది. హోటల్ బయటే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ లోనికి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ శివకుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రెబల్స్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మంటేనే తాను వచ్చానని అన్నారు.