ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రస్తుతించారు. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు.