మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 18, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.