నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లిదండ్రుల చెంతకు భవానీ చేరింది. ఆదివారం మీడియా సమక్షంలో పెంచిన తల్లిదండ్రులు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ తనకూ ఇద్దరూ తల్లులు ఇష్టమేనని, పదిరోజులు పెంచిన అమ్మ దగ్గర ఉంటే, మరో పది రోజులు కన్న తల్లి వద్ద ఉంటానని తెలిపింది. తనకు ఇప్పటివరకు కన్‌ఫ్యూజన్ ఉండేదని, ఇకనుంచి ఇద్దరి వద్ద ఉంటానని చెప్పింది. ప్రస్తుతానికి కన్న తల్లి వద్దకు వెళుతున్నట్టు తెలిపింది. కన్నవాళ్ళ వద్దకు వెళుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. భవానీ కనిపించడం సంతోషంగా ఉందని కన్నతల్లి తెలిపారు. తనను ఇన్నాళ్లు పెంచినందుకు జయమ్మ-జీవరత్నం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.