ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుందని, అక్కసుతోనే అభివృద్ధికి అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేశారని, అది కూడా సక్సెస్ కాలేదని విమర్శించారు.