జపాన్‌ను కుదిపేసిన తుపాను | Japan's strongest typhoon in 25 years kills at least six | Sakshi
Sakshi News home page

జపాన్‌ను కుదిపేసిన తుపాను

Published Wed, Sep 5 2018 8:36 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

జపాను దేశాన్ని భారీ తుఫాన్  అతలాకుతలం  చేసింది.  గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ గడగడలాడించింది. జెబీ ధాటికి ఏడుగురు మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు క్షతగ్రాతులయ్యారు. 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో  రవాణా పూర్తిగా స్థంభించింది.  ముఖ్యంగా ఒసాకాలోని కన్‌సాయి ఎయిర్‌పోర్టులోకి వరద నీరు  పోటెత్తడంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 700 విమానాలనురద్దు చేశారు.  క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది.  జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.   దేశంలోని చాలా ప్రాంతాలలో  విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి.  సుముద్ర తీరంలోని నిషినోమియా కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వందల కార్ లుఅగ్నికి ఆహుతయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement