‘‘నల్లగొండ, పాలమూరు సభల వద్ద పల్లీలు, బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చిన జనం అంత లేరు అలంపూర్‌లో నిన్న కాంగ్రెస్ మీటింగ్ వద్ద. కానీ వాళ్లు ఏం మాట్లాడారు? కేసీఆర్ బట్టేబాజ్, ధోఖేబాజ్ అంటూ ఒక పీసీసీ అధ్యక్షుడు .. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది సంస్కారమా? బుడ్డర్‌ఖాన్‌లు కత్తి తిప్పినట్లు గద్వాల స్టేజ్ మీద జానారెడ్డి, మిగిలిన వాళ్లు కత్తులు తిప్పినరు. కత్తులు తిప్పవలసిన కాడ తిప్ప లే. తిప్పకూడని కాడ తిప్పిండ్రు. మున్ముందు చెప్త వాళ్ల సంగతి’’అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.