లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ కాదని, వాటిని తాత్కాలిక స్పీడ్‌బ్రేకర్‌గా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలనే భావన ఏర్పడిందని, బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయన్నారు.