బాబూ నీ బండారం బయటపెడతాం! | KTR,Harish rao fires on chandrababu naidu | Sakshi

బాబూ నీ బండారం బయటపెడతాం!

Published Mon, Nov 5 2018 7:06 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఎంపిక చేయడం లేదని, చంద్రబాబు నాయుడే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, రచనలు చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. మహాకూటమి రూపంలో మొండి చెయ్యితో కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజల చెవ్వుల పువ్వులు పెట్టడానికి బీజేపీ పార్టీ.. అగ్గిపెట్టె గుర్తుతో పుల్లలు పెట్టడానికి కోదండరాం పార్టీలు వస్తున్నాయని విమర్శించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు.. ముసలి నక్క.. గుంట నక్కలు ఏకమై మాయల కూటమి రూపంలో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లిలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ‘నోట్ల కట్టలకు ఆశపడి ఇజ్జత్‌ తక్కువ కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో దోస్తీ కట్టి ఇక్కడి రైతాంగాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి కర్రు కాల్చి వాతలు పెడతారు. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు సీట్లు.. నోట్ల కోసం చంద్రబాబుకు దాసోç ßæం అవుతున్నారు’అని మంత్రి విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement