ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు. పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు.