ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళుతున్నారా? కాస్త ఆగండి. ఇంతకుముందులా మీరు సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. సందర్శకులను నియంత్రించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబుతో సోమవారం నాయీ బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) హడావుడిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పేషీలనుంచి జారీ చేసే పాసులు, ఫోనుకాల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించింది.