ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యూజికల్ షోలో ప్రముఖ స్పానిష్ పాప్‌స్టార్, డాన్సర్ జోయానా సెయిన్స్ దుర్మరణం పాలయ్యారు. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తుండగా బాణా సంచా పేలింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.