తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన ఆ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్దిరోజులకే అందులోకి అడుగుపెడు తున్న శిశువులకు అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమవుతున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలుగానే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలికాలంలో వరుసగా 10 మంది శిశువులు మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతు న్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పిం చేందుకు నల్లగొండ, దేవరకొండలో శిశుగృహా లు ఏర్పాటు చేశారు.