Infants
-
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్‌ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
ఒకే కాన్సులో నలుగురికి జన్మ.. గంటల వ్యవధిలోనే శిశువులు మృతి
ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. శిశువుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒకరు అమ్మాయి ఉన్నారు. అయితే దురదష్టవశాత్తు ఆ నలుగురు చిన్నారులు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆదివారం పురుటి నొప్పులు రావడంతో స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు. ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమె సాధారణ కాన్పు ద్వారా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు. అయితే నలుగురు చిన్నారులు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టినట్లు వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక సంరక్షణ అవసరమని, నియోనాటల్ ఇంటెన్వివ్ కేర్ యూనిట్లో తక్షణమే చేర్పించాలని పేర్కొన్నారు. కానీ కుప్వారా జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు ఆడ శిశువులు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మగ శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా కుప్వారా జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి, నవజాత శిశువుల అత్యవసర సంరక్షణ సౌకర్యాలు లేవు. దీంతో ఎక్కువగా రోగులను శ్రీనగర్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక చాలా దూరం ప్రయాణించడంతో రోగులు మరణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్‌ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్‌నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
తల్లీబిడ్డల ఆరోగ్యానికి అభయం.. ‘కిల్కారీ’కి శ్రీకారం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు ‘కిల్కారీ’ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల మొబైల్‌కు డాక్టర్ అనిత అనే కల్పిత వైద్యురాలి వాయిస్‌తో ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన పోషకాహారం, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు వంటి అంశాలను వివరిస్తారు. ఈ సందేశాలు గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. వారిలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసే విధంగా వాయిస్ సందేశం ఉంటుందని చెబుతున్నారు. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి.. మహిళ గర్భం దాల్చిన నాల్గవ నెల నుంచి పాలిచ్చే తల్లుల వరకు.. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ 72 సార్లు మొబైల్ సందేశాలు వచ్చేలా కిల్కారీ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ 0124488000 నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఒకసారి ఫోన్ ఎత్తకుండా మిస్ అయితే, ఐవీఆర్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఒకేరోజు మూడుసార్లు ఫోన్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకు రెండుసార్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గర్భిణులు, బాలింత కిల్కారీ నుంచి కాల్ పొందలేకపోయినా, ఆ వారాల సందేశాన్ని తిరిగి వినాలనుకున్నా ఆమె దానిని మళ్లీ వినడానికి 14423కు డయల్ చేయవచ్చు. బాలింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను వివరిస్తారు. కిల్‌కారీపై విస్తృత అవగాహన గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రవేశ పెట్టిన కిల్కారీ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం. ఏఎన్ఎంలు ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లులను నమోదు చేస్తుండగా, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని వారు తప్పకుండా ఆ సందేశాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యం విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా సమగ్ర సమాచారాన్ని కల్పిత డాక్టర్ వాయిస్‌తో వారికి చేరవేస్తారు. డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్ జిల్లా -
తల్లి గర్భంలోనే రుచుల మక్కువ
లండన్: కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జన్మించిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు. -
ఉమ్మనీటి సంచితో కవలల జననం
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది. -
కేర్‌టేకర్ దాష్టీకం.. చిన్నారి బ్రేన్పై ఎఫెక్ట్!
పసి పిల్లల ఆలనా, పాలనా చూసుకోమని కేర్ టేకర్‌ని పెట్టుకుంటే సదరు మహిళ ఆ చిన్నారుల్ని చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలన్పూర్ పాటియా హిమగిరి సొసైటీలో నివాసముంటున్న ఓ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. తమ ఉద్యోగం కారణంగా వారిని చూసుకోవడానికి కోమల్ తంద్లేకర్ అనే మహిళను కేర్ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే సదరు మహిళ ఓ రోజు ఆ కవలల్లో ఒకరిపై తన శాడిజమ్ ప్రదర్శించింది. ఒక బిడ్డను చెవులు మెలిపెట్టడంతో పాటు చెంపలపై కొట్టి, చేతి గోర్లను కొరకడమేగాక ఆ చిన్నారిని మంచంపై విసిరిపడేసింది. అలా ఓ ఐదు నిమిషాల పాటు కేర్‌టేకర్ పసికందును దారుణంగా కొట్టింది. ఇక ఆ దెబ్బలకు చిన్నారిలో కదలిక లేకపోవడంతో చేసేది లేక ఆ యువతి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దాంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ దెబ్బలకు చిన్నారి తలలో మెదడు దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు. అయితే తమ ఇంట్లో అప్పటికే అమర్చి ఉన్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో కేర్‌టేకర్ చేసిన నిర్వాకం బయటపడింది. ఇక వెంటనే బాధిత చిన్నారుల తండ్రి మితేష్ పటేల్ కేర్ టేకర్‌పై రాందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో కేర్‌టేకర్ కోమల్ తంద్లేకర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
శిశువుల రిజిస్ట్రేషన్‌లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంత మంది శిశువులు పుడుతున్నారు.. వారి వివరాలు ఏమిటి.. వారి ఆరోగ్యం ఎలా ఉంది.. తదితర వివరాల నమోదు ప్రక్రియ ఇప్పుడు పరుగులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్సీహెచ్ (రీ ప్రాడక్టివ్ చైల్డ్ హెల్త్) పోర్టల్‌లో చిన్నారుల నమోదులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జనాభా గణన నుంచి, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల వరకూ ఈ పోర్టల్‌లో నమోదయ్యే వివరాలే కీలకంగా ఉన్నాయి. అయినప్పటికీ చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పుట్టే శిశువుల వివరాలను నమోదు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2019కి ముందు ఈ పోర్టల్‌లో 50 శాతానికి మించి నమోదు జరిగేది కాదు. ఇప్పుడు 2020–21లో 90 శాతం నమోదు అవుతున్నట్టు ఆరోగ్య శాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96.78 శాతం నమోదైనట్టు తేలింది. మొత్తంగా గత 11 మాసాల్లో 6.98 లక్షల మంది చిన్నారుల వివరాలు నమోదయ్యాయి. పోర్టల్‌లో నమోదు వల్ల ఎన్నో ఉపయోగాలు ► ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు వల్ల జనగణన పక్కాగా ఉంటుంది. ► చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, ఇతర వైద్య సదుపాయాలు కల్పించడం సులువవుతుంది. ► జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు పంపిణీ చేస్తుంది. ► చిన్నారులతో పాటు తల్లుల వివరాలూ ఆటోమేటిగ్గా పోర్టల్‌లో నమోదవుతాయి. ► వివరాలు అందుబాటులో ఉండటం వల్ల మెడికల్ రికార్డు పక్కాగా అమలు చేయొచ్చు. ► శిశువుల్లో వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం. ► పోర్టల్‌లో నమోదు అయిన చిన్నారుల ఆరోగ్య సమస్యలపై స్పెషల్ ట్రాకింగ్ ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 2 వరకు పోర్టల్‌లో నమోదు అయిన శిశువుల వివరాలు -
ప్రతి 5 నిమిషాలకు ఏడుగురి జననం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏడుగురు శిశువులు కొత్త ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అంటే నిమిషానికి 1.39 మంది పుడుతున్నట్టు లెక్క. సగటున రోజుకు 2,013 మంది జనాభా లెక్కల్లోకి ఎక్కుతున్నట్టు తాజా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడిచిన 10 నెలల్లో 6,03,977 మంది శిశువులు రాష్ట్రంలో జన్మించారు. వీళ్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనన నమోదు పత్రాలు ఇచ్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో శిశువులు పుడుతున్నట్టు తేలింది. 6,03,977 ప్రసవాల్లో ఆస్పత్రుల్లో జరిగినవి 6,01,652. అంటే 99.85 శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టిన వారే. ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన వారు 2,44,876 మంది (40.70 శాతం) ఉన్నారు. మిగతా 59.30 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. 25 వేల మందికి పైగా బరువు తక్కువ 6,03,977 మంది శిశువుల్లో 25,451 మంది 2 కేజీలు.. అంతకంటే తక్కువ బరువుతో పుట్టినట్టు గణాంకాల్లో వెల్లడైంది. ఇలాంటి బరువు తక్కువ పిల్లలు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది తల్లులు ప్రసవం అయిన గంటలోగానే తల్లిపాలు బిడ్డకు పడుతున్నారు. మొత్తం ప్రసవాల్లో 97.68 శాతం మంది తల్లులు శిశువు పుట్టిన గంటలోపే పాలు పడుతున్నారు. దీనివల్ల బిడ్డకు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 95.86 శాతం మంది తల్లులు తమ బిడ్డకు బీసీజీ, పోలియో, తట్టు తదితర వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నట్టు వెల్లడైంది. -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
శిశువులు తక్కువ..తల్లులు ఎక్కువ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని శాఖల గణాంకాలను ఈ ఐదేళ్లల్లో కాకిలెక్కలతో రూపొందిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం గర్భిణుల విషయంలోనూ తప్పుడు సంఖ్యలు.. పొంతనలేని వివరాలతో జాబితాలు రూపొందించి కేంద్రం దృష్టిలో అభాసుపాలవుతోంది. గర్భిణుల సంఖ్య, పుట్టే పిల్లల సంఖ్య ఎక్కడా సరిపోలడంలేదు. రాష్ట్రంలో గర్భిణులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించే క్రమంలో ఈ తప్పులతడకలు భారీగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బర్త్ రేటు (పుట్టే చిన్నారుల శాతం) తగ్గుతూంటే మరోవైపు గర్భిణుల శాతం మాత్రం అమాంతంగా పెరిగిపోతోంది. మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 16.4 శాతం చిన్నారులు పుడుతున్నారు. కానీ, గర్భిణులను మాత్రం 19 శాతానికి పైగానే అని ఆరోగ్య శాఖాధికారులు చూపిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నారా లేదా ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నామని చెప్పడానికి ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మాతా శిశు మరణాల విషయంలో ఇలాగే తప్పుడు లెక్కలు చూపించి దక్షిణాదిలో అద్భుతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్టు పలుమార్లు జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో నివేదికలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా తప్పుడు లెక్కలు చూపించి గందరగోళం సృష్టించారు. ఓ వైపు ప్రజాసాధికార సర్వేలో రాష్ట్ర జనాభా 4.50 కోట్లు అని చెబుతుంటే.. కేంద్రం మాత్రం 5.30 కోట్లు అని చెబుతోంది. కేంద్ర లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుని అద్భుతంగా చేస్తున్నామని చూపించడానికి ఇలా తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. గర్భిణుల గణాంకాల్లో గందరగోళం! కాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ రూపొందించిన జాబితాలో తల్లులను ఎక్కువ మందిని చూపించి పిల్లల సంఖ్యను మాత్రం తక్కువగా చూపించారు. ఉదాహరణకు.. కృష్ణా జిల్లాలో ఒక ఏడాదిలో 52 వేల మంది చిన్నారులు (0 వయసు) అని లెక్కల్లో తేల్చారు. అదే గర్భిణుల నమోదులో 82 వేల మందికి పైగా నమోదైనట్లు చూపించారు. అంటే 30 వేల మంది చిన్నారులు పుట్టగానే మృతిచెందినట్లయినా ఉండాలి.. లేదా గర్భిణుల నమోదులో ఎక్కువైనా చేసి చూపించి ఉండాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి ఈ లక్ష్యాలను ఎలాగైనా సాధించాలంటూ ఒత్తిడి తేవడంతో చాలాచోట్ల గర్భిణుల నమోదులో డబుల్ ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదా.. విశాఖపట్నం జిల్లాలోని దొరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక గర్భిణి నమోదై ఉంది. అదే గర్భిణి దేవరాపల్లి, బీమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నమోదై ఉంది. అధికారులు తమ నివేదికలో ముగ్గురు గర్భిణులుగా చూపించి ముగ్గురికీ ప్రతినెలా వైద్యపరీక్షలు అందించినట్టు పేర్కొన్నారు. ఇలా సుమారు 82వేల మంది గర్భిణులను ఒకటికి రెండు లేదా మూడుసార్లు నమోదుచేసి అమాంతంగా వారి సంఖ్యను పెంచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 7 లక్షల పైచిలుకు ప్రసవాలు జరుగుతుండగా, 8.50 లక్షల మంది గర్భిణులను రిజిస్ట్రేషన్ చేసి, వారికి వైద్యమందించినట్లు చూపించారు. ఈ లెక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురవుతోంది. అడ్డగోలుగా టార్గెట్లు రాష్ట్రంలో సరాసరిన 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులోనూ ప్రతి ఏడాదీ బర్త్ రేటు తగ్గుతోంది కాబట్టి గర్భిణుల శాతం కూడా తగ్గాలి. కానీ, ఉన్నతాధికారులు మాత్రం ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు విధిస్తున్న టార్గెట్లు విస్మయం కలిగిస్తున్నాయి. ఏకంగా 9.90 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ టార్గెట్లు విధించారు. ఏ జిల్లాలో ఎంత టార్గెట్ ఇచ్చారో చూస్తే అవాక్కవాల్సిందే. అసలు లేని గర్భిణులను ఎక్కడ్నుంచి చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. గర్భిణుల విషయంలో జిల్లాల వారీగా ప్రభుత్వం విధించిన టార్గెట్లు ఇవీ.. రిజిస్ట్రేషన్లు ఎక్కువ.. బర్త్ రేటు తక్కువ రాష్ట్రంలో 2011 నుంచి బర్త్ రేటు బాగా తగ్గుతోంది. ఉదా.. 2011లో వైఎస్సార్ కడప జిల్లాలో 43,378 మంది చిన్నారులు పుట్టారు. అప్పటి జనన నిష్పత్తి వెయ్యి జనాభాకు 17.5 శాతం. ఆ తర్వాత 16.4కు తగ్గింది. కానీ, ఇప్పుడు చిన్నారుల రిజిస్ట్రేషన్ టార్గెట్ 57,443 మందిని ఇచ్చారు. ఓ వైపు బర్త్ రేటు తగ్గుతూంటే ఎక్కువ చూపించడమేంటో అర్థంకాని పరిస్థితి. కాగా, బర్త్ రేటును సంవత్సరాల వారీగా చూస్తే.. -
‘వ్యాక్సినేషన్’లో ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువులకు టీకాల అనంతరం పారాసిటమాల్ మాత్రలకు బదులు నొప్పి నివారణ ట్రామడాల్ మాత్రలు ఇచ్చిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విధి నిర్వహణలో అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారంటూ రాష్ట్ర వైద్యాధికారులను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వమే పెంటావాలెంట్ టీకాను సరఫరా చేస్తున్న నేపథ్యంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన ఇమ్యునైజేషన్ టెక్నికల్ సపోర్టు బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న పసికందుల ఆరోగ్య పరిస్థితిని ఈ బృందంలోని డాక్టర్ దీపక్ పొలపాకర, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వికాస్ మదన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణకుమార్ సహా మరో ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు. అలాగే శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అలాగే సంఘటన జరిగిన నాంపల్లి ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేశారు. టీకాల నిల్వ, మందుల పంపిణీలో తీసుకుంటున్న జాగ్రత్తలు, పసికందులకు ఇస్తున్న మాత్రలను పరిశీలించారు. కోలుకుంటున్న శిశువులు... నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అస్వస్థతకు గురై నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 34 మంది నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మెరుగుపడింది. వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు శిశువులు శుక్రవారం స్పృహలోకి రావడంతో వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. అయితే ట్రామడాల్ టాబ్లెట్ ప్రభావం మెదడుపై 48 గంటల వరకు ఉండే అవకాశం ఉండటంతో మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. మిగిలిన చిన్నారులంతా కోలుకుంటున్నారు. వారిని శనివారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. పీహెచ్‌సీల నుంచి ట్రామడాల్ వెనక్కి... నవజాత శిశువులు అస్వస్థతకు గురైన ఘటనపై ఈ నెల 11లోగా సమగ్ర నివేదిక సమర్పిం చాలని ప్రజారోగ్య సంచాలకులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఆదేశించారు. ఘటనకు గల కారణాలు, పరిస్థితిపై అధ్యయనానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చైర్‌పర్సన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారంలోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల నుంచి ట్రామడాల్ మాత్రలు, ఇంజెక్షన్లను వెనక్కు తెప్పించాలని, ఈ నెల 18లోగా అన్ని పీహెచ్‌సీలకు పారాసిటమాల్ సిరప్, చుక్కల మందును సరఫరా చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీని ఆదేశించారు. ఇద్దరు శిశువుల మృతికి కారణమైన మెడికల్ ఆఫీసర్, ముగ్గురు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి తొలగించాలని, సూపర్వైజర్, ఎస్పీహెచ్వో, డీఐవోలపై కేసులు నమోదు చేయాలన్నారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జి, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిపై హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పసిబిడ్డలకూ గండం
సాక్షి, అమరావతి: తొమ్మిది మాసాలు కడుపులో ఉన్నప్పుడే కాదు బిడ్డను ప్రసవించాక కూడా ఆ చిన్నారికి తల్లే రక్షణ కవచం. అలాంటి తల్లి నుంచే బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యంతో పసిబిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఇది. వివరాల్లోకి వెళితే.. మన రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చితే వారి నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా ఉండాలంటే నెవరపిన్ సిరప్ విధిగా వేయాలి. అయితే రాష్ట్రంలో నెవరపిన్ సిరప్ పూర్తిగా అయిపోయింది. పొరుగునే ఉన్న తెలంగాణ ముందస్తు జాగ్రత్తతో కొనుగోలు చేసి నవజాత శిశువులకు అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. చిన్నారులకు పొంచివున్న ముప్పు మన రాష్ట్రంలో నెలకు సగటున 100 నుంచి 120 మంది హెచ్ఐబీ బాధిత మహిళలు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి వస్తున్నారు. వీరి నుంచి చిన్నారులను కాపాడేందుకు నెవరపిన్ సిరప్ వేయాలి. దీన్ని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో) సరఫరా చేసేది. అయితే రెండు నెలల క్రితం తాము సరఫరా చేయలేమని, రాష్ట్రాలే సమకూర్చుకోవాలని చెప్పింది. వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లులు భయాందోళన చెందుతున్నారు. డాక్టరును అడిగితే స్టాకులేదని చెబుతున్నారని తల్లులు చెబుతున్నారు. తాము ఎలాగూ చేయని తప్పునకు విధివంచితులమయ్యామని, మా చిన్నారులను బలిచేయవద్దని వారు ఎంత బతిమలాడుకున్నా పట్టించుకునే వారేలేరు. మాత్రను ఐదు సమభాగాలుగా చేసి... నెవరపిన్ సిరప్ అనేది చిన్నారులకు వెయ్యడం చాలా సులభం. కానీ ఆ సిరప్ వెయ్యకుండా మాత్రలు వెయ్యాలని చెబుతున్నారు. ఆ మాత్రలేమో ఒక్కోటి 50 మిల్లీ గ్రాములవి. దీన్ని ఐదు సమభాగాలు చేసి దాన్ని తల్లిపాలలోగానీ, కాచి చల్లార్చిన పాలలోగానీ కలిపి తాగించాలి. కానీ ఈ మాత్రను ఐదు సమభాగాలు చేయడం కష్టం. ఎక్కువో తక్కువో అయ్యిందంటే బిడ్డకు ఇబ్బంది. అధికారులేమో సిరప్ లేదు ఇక మాత్రలు వేసుకోవాల్సిందే అంటూ సెలవిస్తున్నారు. పుట్టిన రోజు నుంచి 6 వారాల వరకూ ఈ సిరప్ వెయ్యాలి. ఆ తర్వాత 18 వారాల వరకూ సెప్ట్రాన్ అనే సిరప్ వెయ్యాలి. ఆ సిరప్‌ను కూడా హెచ్ఐవీ బాధితులు వైద్యానికి వచ్చే ఐసీటీసీ సెంటర్లలో ఉంచకుండా ప్రభుత్వాసుపత్రుల్లోని సాధారణ ఫార్మసీలలో ఉంచుతున్నారు. అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు. అక్కడేమో మందుల కోసం జనం బారులు తీరి నిలబడి ఉండటంతో హెచ్ఐవీ తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం సరఫరా ఆపేసింది గతంలో కేంద్రం సరఫరా చేసేది. ఇప్పుడు ఆపేసింది. ఈ సిరప్‌ను తెప్పించేందుకు బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీతో మాట్లాడాం. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకూ మాత్రలను పౌడర్ చేసి ఐదు సమభాగాలుగా చేసి వెయ్యమని చెప్పాం. సిరప్ రాగానే సరఫరా చేస్తాం. –డా.రాజేంద్రప్రసాద్, అదనపు సంచాలకులు (ఏపీశాక్స్) -
పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్ లేదు
సాక్షి, అమరావతి: అప్పుడే పుట్టిన శిశువులను జబ్బుల నుంచి రక్షించే వ్యాక్సిన్లు (సూదిమందు) ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేక పేద తల్లులు తల్లడిల్లుతున్నారు. ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా నవజాత శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోయినా ప్రభుత్వం చలించకపోవడం గమనార్హం. ఏటా రాష్ట్రంలో 8 లక్షల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రభుత్వాస్పత్రుల్లో దాదాపు 3.80 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సగటున 32,000 మంది శిశువులు జన్మిస్తున్నారు. అయితే, నవజాత శిశువులకు విధిగా ఇవ్వాల్సిన రొటావాక్, హెపటైటిస్–బి వ్యాక్సిన్లు జూన్ 25వ తేదీ నుంచి ఆరోగ్య ఉపకేంద్రాల్లో గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గానీ అందుబాటులో లేవు. అధికారులను అడిగితే స్టాక్ లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో తమ బిడ్డలకు వ్యాక్సిన్లు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న నిరుపేద తల్లులు మరో దిక్కులేక వెనక్కి తీసుకెళ్తున్నారు. అతి కొద్దిమంది మాత్రమే డబ్బు ఖర్చు చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే స్తోమత లేక చాలామంది చిన్నారులు వ్యాక్సిన్లకు దూరమవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, రెండు మాసాలుగా చిన్నారులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు లేకపోయినా పట్టించుకునేవారే లేరని పీహెచ్సీ వైద్యులు చెబుతున్నారు. ఓవైపు మాతా శిశుమరణాలను తగ్గించాలని చెబుతూనే, మరోవైపు కనీసం టీకాలు కూడా లేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వ్యాక్సిన్ల కొరతపై అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా... వారు స్పందించలేదు. రోటావాక్ - బిడ్డ పుట్టగానే ఆరు వారాల్లోగా ఓ సారి, 10 వారాల వయసులో రెండోసారి, 14 వారాల్లోగా మరోసారి ఈ వ్యాక్సిన్ వేయాలి. - చిన్నారుల్లో వచ్చే నీళ్ల విరోచనాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. హెపటైటిస్–బి - బిడ్డ పుట్టిన 24 గంటల్లోగా ఈ వ్యాక్సిన్ వేయాలి. - ప్రమాదకరమైన హెపటైటిస్ (కామెర్లు) వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. - ఇది వేయకపోతే చిన్నారులు కామెర్లకు గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది. -
చిన్నారుల మృత్యుఘోష..
-
చిన్నారుల మృత్యుఘోష..
నల్లగొండ: తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన ఆ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్దిరోజులకే అందులోకి అడుగుపెడు తున్న శిశువులకు అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమవుతున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలుగానే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలికాలంలో వరుసగా 10 మంది శిశువులు మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతు న్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పిం చేందుకు నల్లగొండ, దేవరకొండలో శిశుగృహా లు ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో దేవరకొండ కేంద్రాన్ని కూడా నల్లగొండలోనే కలిపి నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశుగృహానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంఖ్య పది మంది చిన్నారులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ రెండు గృహాల్లో కలిపి మొత్తం 50 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శిశుగృహలో పదిమంది దాటితే హైదరాబాద్ లోని శిశువిహార్‌కు తరలించాలి. కానీ, అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేకపోవడంతో నల్లగొండలోనే ఉంచుతున్నారు. అయితే నల్ల గొండ కేంద్రంలోని చిన్నారులకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అధికారులు అందిస్తున్న పోషకాహారం లో లోపాలు ఉండటంతో శిశువులకు ఏ కొద్దిపాటి అనారోగ్య సమస్య తలెత్తినా అల్లాడిపోతున్నారు. శిశువుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే కావడం, వారి వయస్సు రోజుల వయస్సు నుంచి రెండేళ్ల లోపే ఉండటంతో అనారోగ్య సమస్యలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటం.. శిశుగృహాల్లో చేరుతున్న చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. తల్లినుంచి వేరైన పిల్లలకు ముర్రుపాలు అందకపోవడం ప్రధాన సమస్య అయితే ఆ తర్వాత అధికా రులు అందించాల్సిన పౌష్టికాహారం కూడా సమపాళ్లలో అందడం లేదు. పాల డబ్బాలు కొనేందుకు కూడా అధికారుల వద్ద డబ్బులు లేకపోవడంతో విజయ డెయిరీ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెట్రా పౌడర్ ప్యాకెట్లను వాడుతున్నారు. ప్యాకెట్లలోని పౌడర్‌లో పౌష్టికాహార గుణాలు తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం శిశువుల ఎదుగుదలపై పడుతుందని వైద్యులు తెలిపారు. పోషకాహార లోపంతోనే చిన్నారులు వాంతులు, విరోచనాలు, శ్వాసకోస వ్యాధుల తో ఆస్పత్రుల్లో చేరారు. పిల్లలకు ఇస్తున్న పాల పౌడర్‌లో లోపం ఉండటంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని తేలింది. టెట్రా పౌడర్ వాడటం వల్ల కిడ్నీలపై దాని ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. మరో శిశువుకు పాలు పట్టించడంలో ఆయాలు సరైన పద్ధతి పాటించకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. శిశువుకు పట్టిన పాలు శ్వాసనాళానికి అడ్డుపడ టంతో ఊపిరి పీల్చు కోలేకపోయింది. ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొ చ్చినా వైద్యులు కాపాడలేకపోయారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న 20 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. సకాలంలో వైద్యం అందక.. శిశుగృహలోని పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటికప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గి బరువు తక్కువగా ఉన్న పిల్లలకు వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు. వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో వెనుకాడుతున్నారు. చివరికి శిశు వులను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు నెలల కాలంలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు పదిమంది శిశువులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం 8 మంది చిన్నారులు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని నిలోఫర్‌కు తరలించారు. -
భాషల్లో తేడాలు గుర్తించే గర్భస్థ శిశువులు!
గర్భంలో ఉండే శిశువు ఎనిమిదో నెల నుంచి వేర్వేరు భాషలను గుర్తించగలదని అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. కాన్సస్ విశ్వవిద్యాలయ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు 24 మంది గర్భిణులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. గర్భస్థ శిశువుల గుండె చప్పుళ్లతోపాటు అతిసూక్ష్మ స్థాయిలో ఉండే అయస్కాంత క్షేత్రాలను గుర్తించే బయోమాగ్నెటో మీటర్స్‌ను ఇందులో ఉపయోగించారు. ఇంగ్లిష్, జపనీస్ భాషల్లో రికార్డు చేసిన కొన్ని మాటలను వినిపించారు. ఇంగ్లీష్ భాషలో సంభాషణలు విన్నప్పుడు శిశువు గుండె చప్పుడు సాధారణంగా ఉండగా.. జపనీస్ భాషలో విన్నప్పుడు మా త్రం స్పష్టమైన తేడాలు కనిపించాయి. రెండు భాషల ఉచ్ఛారణల్లో తేడా ఉండటం వల్ల ఇలా జరుగుతుందని.. తల్లి మాటలతోపాటు గర్భంలో ఉండే శబ్దాలకు అలవాటు పడ్డ శిశువు ఇతర భాషలో మాటలు విన్నప్పుడు వచ్చిన స్పందన గుండె చప్పుడులో మార్పులకు కారణమవుతోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మినాయి తెలిపారు. -
పసిమొగ్గల హృదయ విలాపం
►కన్నబిడ్డను వదిలి వెళ్లిపోయిన మరో తల్లి ►గత కొద్దిరోజుల్లో మూడో ఘటన ►పురిట్లోనే అనాథలుగా శిశువులు పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి వేళ తగరపువలస హైవే పక్కన ఓ బిడ్డను వదిలిపెట్టారు.. మొన్నేమో.. అవయవాలు వృద్ధి చెందకుండా పుట్టిందన్న ఉక్రోషంతో కన్నపేగునే సజీవ సమాధి చేయడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి.. ఇప్పుడేమో.. ఈ లోకంలోకి వచ్చిన రెండో రోజే నన్ను దిక్కులేని దాన్ని చేశావా అమ్మా.. అని ఘోషిస్తోంది ఓ ఆడ శిశువు హృదయం.. మాటల్లో చెప్పలేని ముక్కుపచ్చలారని ఆ పురిటిగుడ్డుకే మాటలొస్తే.. ఆ హృదయ ఘోష ఎలా ఉంటుందంటే.. అమ్మా.. ఎంత పని చేశావు.. నువ్వు మోసపోయిందే కాకుండా.. నన్నూ మోసం చేశావా! మోసపోయేవారి బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా.. ఇంకా ఈ లోకాన్ని పూర్తిగా చూడకుండానే నన్ను అనాథను చేసి పోవడానికి నీ మనసు ఎలా అంగీకరించిందమ్మా.. అసలు నేను చేసిన నీకు పుట్టడమా లేక ఆడపిల్లగా పుట్టడమా.. నన్ను భరించలేనప్పుడు.. నవమాసాలు మోసి ఎందుకు కన్నావమ్మా.. నాలో ఏ లోపం చూశావమ్మా.. అందంగా ఉన్నానని ఆస్పత్రిలో నర్సులు, డాక్టరమ్మలూ.. అందరూ నన్ను ముద్దు చేస్తున్నారే.. మరి నీకు మాత్రం ముద్దుగా కనిపించలేదా.. ముద్దుమురిపాలు పంచాలనిపించలేదా.. నీ పొత్తిళ్లలో దొరికినంత హాయి.. నాకు ఇంకెక్క లభిస్తుందమ్మా.. నీవు లేని ఈ లోకంలో ఒంటరిగా ఎలా ఉండగలను.. ఎంతమంది అండ లభించినా.. అమ్మ ఇచ్చేంత అండ ఎవరివ్వగలరు.. రేపు ఈ సమాజం నీ తల్లి ఎవరంటే.. ఏం సమాధానం చెప్పాలి.. అందుకే నువ్వెక్కడున్నా.. వెంటనే తిరిగి రా అమ్మా.. నీ వెచ్చని ఒడిలో నన్ను హాయిగా సేదతీరనివ్వమ్మా.. ఆదుకున్న వారినే ఏమార్చి.. పొదివి పట్టుకొని కాపాడుకోవాల్సిన ఈ బిడ్డను పక్కవారికి అప్పగించి పారిపోయిన ఆ కన్నతల్లి కూడా ఏ దిక్కూలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఐదురోజుల క్రితం ఓ నిండు గర్భిణి(30) మల్కాపురంలోని నగరాల వీధికి చెందిన లక్ష్మి అనే మహిళను కలుసుకుంది. తన పేరు జోగాదేవి అని పరిచయం చేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడిని ప్రేమించానని.. కన్నవారింటి నుంచి అతనితో వచ్చేసి వివాహం చేసుకున్నానని చెప్పింది. అయితే తన భర్త తమ ఇంటి పక్కనే ఉన్న మరో యువతిని తీసుకొని ఎటో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. నెలలు నిండిన సమయంలో ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చానని తన కష్టం చెప్పుకోవడంతో లక్ష్మి కరిగిపోయింది. తన వివరాలు పూర్తిగా చెప్పకపోయినా సాటి ఆడదానిగా దేవిని అక్కున చేర్చుకుంది. తన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఇంట్లో ఆశ్రయమిచ్చింది. అలా ఆ ఇంట్లో చేరిన దేవికి ఈ నెల 18(శనివారం) ఉదయం నొప్పులు మొదలయ్యాయి. దాంతో తన సోదరుడు, మరదలి సాయంతో దేవిని ఆటోలో తీసుకొచ్చి ఘోషా ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా అక్కడే ఉండి సపర్యలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం జోగాదేవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ డెలివరీ కావడంతో రెండుమూడు రోజుల్లోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. కాగా ఈ నెల 19(ఆదివారం) సాయంత్రం ఏడు గంటల సమయంలో బాత్రూముకు వెళతానని చెప్పి బిడ్డను లక్ష్మికి అప్పగించి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో బిత్తరపోయిన లక్ష్మి ఆస్పత్రివర్గాలకు సమాచారమిచ్చింది. అంతా కలిసి వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రమాద ఘోష
నవజాత శిశువుల విభాగంలో భారీ అగ్నిప్రమాదం ఏసీ నుంచి రేగిన మంటలు.. పొగ భయంతో బిడ్డలతో సహా పరుగులు తీసిన బాలింతలు తక్షణమే రంగంలోకి దిగి కిందికి తరలించిన ఆస్పత్రి సిబ్బంది వారి అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా షార్ట్ సర్క్యూటే కారణమంటున్న అధికారులు సాయంత్రం నాలుగ్గంటల సమయం.. అది ఘోషా ఆస్పత్రి నవజాత శిశువుల విభాగం.. మూడంతస్తుల ఆ విభాగంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు.. విపరీతమైన పొగ.. ఆ అంతస్తులోని వార్మర్లలో అప్పుడే పుట్టిన శిశువులు.. వారి చెంత తల్లులు ఉన్నారు.. ఒక్కసారిగా రేగిన మంటలు, పొగ.. వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.. భయకంపితులను చేశాయి.. వార్మర్లలో ఉన్న బిడ్డలను పట్టుకొని.. భయంతో పరుగులు తీశారు.. అదే సమయం ఆస్పత్రి సిబ్బంది ఉరుకులు.. పరుగుల మీద వచ్చి.. ఆ అంతస్తులో ఉన్న వారందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. దాంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది.. ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌స్క్యూట్ కారణమని అంటున్నా.. ఇంకేమైనా లోపాలున్నా యేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): పాతనగరంలోని ప్రభుత్వ విక్టోరియా(ఘోషా) ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంతో రోగులు, బాలింతలు హాహాకారాలు పెట్టారు. ఆస్పత్రిలోని నవజాత శిశువుల విభాగంలోని వార్మర్లు ఉండే అంతస్తులోని ఓ ఏసీ మిషన్ నుంచి సాయంత్రం 4.10 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు, ఆ వెంటనే మంటలు రేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే అప్పటికే ఏసీ నుంచి రేగిన మంటలు, నల్లటి పొగ ఆ అంతస్తు మొత్తానికి వ్యాపించడంతో అక్కడే ఉన్న బాలింతలు భయంతో కంపించిపోయారు. ఆ సమయంలో వార్మర్లలో 9మంది శిశువులు ఉన్నారు. తల్లులు తమ బిడ్డలను పట్టుకొని భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది నవజాత శిశువులను, తల్లులను కిందికి తరలించారు. ఆక్సిజన్ సిలెండర్ల కనెక్షన్లు తొలగించి.. సిలెండర్లను కిందకు చేర్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. భారీ నష్టం ప్రాణ నష్టం తప్పినా.. ఆస్తినష్టం మాత్రం భారీగానే వాటిల్లింది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే 12 వార్మర్లు, 7 ఫోటో థెరపీ యంత్రాలు, 7 పల్సాక్సి మీటర్లు, 2 ఆక్సిజన్ యంత్రాలు, 3 ఏసీలు దెబ్బతిన్నాయి. నాలుగు వార్మర్లు, మూడు ఫోటో థెరపీ యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. వార్మర్లలో ఉన్న 9 మంది చిన్నారులను కిందకు చేర్చిన తర్వాత.. వారిలో ముగ్గురిని కేజీహెచ్‌కు తరలించి.. మిగిలిన వారిని ఘోషా ఆస్పత్రిలోనే ప్రసూతి వార్డులో ఉంచారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. నిచ్చెన సాయంతో ప్రమాదం సంభవించిన అంతస్తుకు చేరుకుని అద్దాలు పగులగొట్టి కిటికీలు తెరవడంతో అంతవరకు దట్టంకా అలుమున్న నల్లటి పొగ బయటకు వెళ్లిపోయింది. మంటలను అదుపు చేయడంతో పాటు మరింతగా వ్యాపించకుండా ఆ పరిసరాలను పూర్తిగా నీటితో తడిపారు. పగటిపూట కాకుండా అగ్నిప్రమాదం రాత్రి జరిగి ఉంటే పెను నష్టం వాటిల్లేది. అందరూ నిద్రావస్థలో ఉంటారు కనుక భారీ ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉండేదని అంటున్నారు. రూ.25 లక్షల నష్టం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మలీల చెప్పారు. ఏసీ నుంచి పొగలు, మంట రావడం గమనించి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. వారి అప్రమత్తత కారణంగానే ప్రాణానష్టం తప్పిపోయిందన్నారు. ఏసీలు, వార్మర్లు, ఇతర పరికరాలు కాలిపోవడం వల్ల సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందని ఆమె చెప్పారు. -
శిశువుల ఆరోగ్యం లాకెట్టులో!
‘ఖుషీ బేబీ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్న రాజస్థాన్ జైపూర్: పుట్టిన ప్రతి శిశువుకు టీకాలు వేయించడం ఇప్పుడు తప్పనిసరైపోయింది. ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధులు భవిష్యత్తులో వారికి హాని కలిగించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ టీకాలు వేయిస్తుంటాం. అయితే ఏ టీకాలు వేశారు? మరే టీకాలు వేయాలి? అనే విషయంలో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా అటు వైద్యులు, ఇటు తల్లిదండ్రులు పొరపడుతూనే ఉన్నారు. వేసిన టీకానే మళ్లీ వేయించడం, వేయించాల్సిన టీకా వేయించకపోవడం వంటి సంఘటనలు అంతటా జరుగుతూనే ఉన్నాయి. కార్డులు, రికార్డుల్లో నమోదు చేసినా.. సమయానికి అవి దొరక్క ఏదో ఒక టీకా వేసి పంపేస్తున్న ఘటనలు కూడా పునరావృతమవుతున్నాయి. అయి తే ఈ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొన్నారు రాజస్థాన్‌లోని జైపూర్ వైద్యాధికారులు. అదే ‘ఖుషీ బేబీ’. ఖుషీ బేబీ అనేది ఓ డిజిటల్ లాకెట్. టీకాల కార్యక్రమం మొదలు కాగానే పిల్లల మెడలో ఈ లాకెట్ వేస్తారు. టీకా కోసం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వేసిన టీకా వివరాలను ట్యాబ్ సాయంతో డిజిటల్ లాకెట్లో పొందుపరుస్తారు. దీంతో కార్డు పోగొట్టుకున్నామని, మర్చిపోయామని చెప్పడానికి అవకాశం లేదు. వేయాల్సిన టీకాపై స్పష్టత ఉంటుంది. అలాగే లాకెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వైద్య విభాగం అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లాకెట్లో ఏదైనా సమస్య వచ్చినా.. ట్యాబ్‌లోని సమాచారంతో టీకా వేస్తారు. ఓ రకంగా పిల్లల ఇమ్యునైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ చేయడమన్నమాట. ఉదయ్‌పూర్‌లోని 81 ఆరోగ్య కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. -
పిల్లలు వేళ్లు చీకడం మంచిదే!
మెల్బోర్న్: మీ పిల్లలకు వేళ్లు చీకడం, గోళ్లు కొరకడం లాంటి అలవాట్లున్నాయా? అవి చేయవద్దని మీరు పిల్లల్ని వారిస్తున్నారా? అయితే ఇది చదవండి. చిన్నతనంలో వే ళ్లు చీకడం, గోళ్లు కొరకడం వంటివి చేసే పిల్లలు అలర్జీల బారిన పడే ప్రమాదం తక్కువని పరిశోధనలో తేలింది. పెద్దయ్యాక కూడా వారి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందట. పిల్లలకు గనుక ఈ రెండు అలవాట్లూ ఉంటే వారు మరింత ఎక్కువ నిరోధకతను పొందుతారు. ఇంట్లోని దుమ్ము, తలలో ఉండే పేలు, గడ్డి, పిల్లులు, కుక్కలు, గుర్రాలు ఇంకా గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మజీవులు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలంటున్నారు. చిన్నతనంలో దుమ్ము, సూక్ష్మజీవులను నిరోధించే శక్తిని పొందితే అది పెద్దయ్యాక కూడా ఉపయోగపడుతుందని, అలాంటి వారికి అలర్జీలు సోకే ప్రమాదం తక్కువని కెనడాలోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మాల్కోమ్ సియర్స్ చెప్పారు. -
ప్రాణాలు కాపాడే మిల్క్ బ్యాంకులు!
తల్లిపాల్లో ఉండే పోషకాలు శిశువులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. ఫార్ములా పాలు, పిండి పాలల్లో తల్లిపాలల్లో వలె వ్యాధి నిరోధకాలు, ఎంజైములు, హార్మోన్లు ఉండే పరిస్థితి లేదు. అందుకే తల్లి పాలకు మరే పాలు ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఇప్పుడు రాజస్థాన్ లో తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఎందరో బిడ్డల ప్రాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇండియాలో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 40 మందిదాకా ఐదేళ్ళు నిండక ముందే చనిపోతున్నారు. అయితే ముందు జాగ్రత్తలను విస్మరించడమే మరణాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా శివువుల మరణాల్లో రాజస్థాన్ రాష్ట్రం అగ్రభాగంలో ఉంది. ఐదేళ్ళు నిండక ముందే చనిపోయే పిల్లలు ఇక్కడ అత్యధికంగా 47 శాతం ఉంటున్నారు.అయితే పౌష్టికాహారం గల తల్లిపాలతో ఇటువంటి మరణాలను నివారించవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, రాష్ట్రంలో ఇటీవల మూడు తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. బిడ్డల పౌష్టికాహార లోపానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ అనాధాశ్రమంలో ముందుగా దివ్యా మదర్ మిల్క్ బ్యాంకును దేవేంద్ర అగర్వాల్ స్థాపించారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో 2013 లో ఉదయపూర్ లో పాల బ్యాంకును స్థాపించి అప్పటినుంచీ సేవలు అందించడం ప్రారంభించాడు. దివ్యా మదర్ మిల్క్ బ్యాంక్ (డీఎంఎంబి) స్థాపనతో గత మూడేళ్ళలో సుమారు 1500 మంది శిశువుల ప్రాణాలను రక్షించగలిగారు. అనంతరం తల్లిపాలపై అవగాహనతో అనేకమంది మిల్క్ బ్యాంకులకు పాలను అందించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జైపూర్ మహాత్మా గాంధీ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో ప్రారంభించిన మిల్క్ బ్యాంకుకు 74 మంది వరకూ పాలను డొనేట్ చేయడంతో ఇప్పటికే 25 వేల మిల్లీలీటర్ల పాలను బ్యాంకులో సేకరించారు. అమృత్ పేరిట స్థాపించిన ఈ పాల బ్యాంకు నుంచి స్థాపించిన రెండు నెలల్లో 196 యూనిట్ల పాలను శిశువులకు వినియోగించారు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇండియా లెక్కల ప్రకారం దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ముందే ఉన్నప్పటికీ... కొందరు తల్లుల్లో అవగాహన లోపం పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. తల్లుల్లో పోషకాహార లోపం కూడ పిల్లలకు పాలు లేకుండా చేస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలు... తాగనివారికంటే ఆరు రెట్టు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉందని తల్లిపాల దినోత్సవాల సందర్భంలో యునిసెఫ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తల్లిపాలు ప్రపంచంలోని 13 శాతం మంది పిల్లల ప్రాణాలను రక్షిస్తున్నట్లు యునిసెఫ్ తెలిపింది. ఇండియాలో మొదటి మిల్క్ బ్యాంక్ 'స్నేహ'ను 1989 లో ముంబైలో అర్మిదా ఫెర్నాండెజ్ స్థాపించారు. తల్లులనుంచి సేకరించిన పాలను ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు అందించేందుకు వినియోగించేవారు. డాక్టర్ ఫెర్నాండెజ్ స్థాపించిన ఆ బ్యాంకు... ఎంతోమంది పిల్లలకు ప్రాణాలు పోస్తూ 2014 లో 25 ఏళ్ళ వేడుకను కూడ జరుపుకొంది. ప్రస్తుతం గేదె, ఆవు పాలను పాశ్చురైజ్ చేస్తున్నట్లుగానే తల్లిపాలను కూడ ఇక్కడ పాశ్చురైజ్ చేసి నిల్వ చేస్తున్నారు. ఈ పాలను ఆర్నెల్లలోపు అవసరమైన పిల్లలకు అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో పాలను నిల్వ చేసేందుకు ఇష్టపడే తల్లులు సదరు బ్యాంకుల్లో ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఉండే బ్యాంకుల్లో సంతకం చేసి పాలను డొనేట్ చేస్తే... ఎంతోమంది శిశువుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పడు ముంబైతోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఈ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ బ్యాంకులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా మరిన్ని మిల్క్ బ్యాంకులను స్థాపించి శిశుమరణాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. -
చిన్నారులను అమ్మేసిన వ్యక్తికి ఉరిశిక్ష
22 మంది శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో అమ్మేసిన వ్యక్తిని చైనాలో శుక్రవారం ఉరితీశారు. సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో ఉరి శిక్ష అమలు చేసినట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్పీసీ) శుక్రవారం వెల్లడించింది. 2008 నుంచి 2013 వరకు టాన్ యాంగ్జీ (69) మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి పిల్లలను కొనుగోలు చేసి హెనన్ ప్రావిన్స్‌లో అమ్మేశాడు. ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేసినట్టు తేలింది. 2014లో ఉరిశిక్ష విధించిన సమయంలో తాను తప్పేమీ చేయలేదని, పిల్లలు లేనివారికి మంచే చేశానని టాన్ సమర్థించుకున్నాడు. మగ శిశువులను 30,000 యువాన్లకు, ఆడ శిశువులను 16,000 యువాన్లకు కొనుగోలు చేసేవాడు. వారిని వెయ్యి నుంచి మూడు వేల యువాన్ల లాభంతో అమ్మేసేవాడని తేలింది. గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాలో మహిళలు, పిల్లల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో ఇలాంటి కేసుల్లో మొత్తం 1,362 మందికి జైలుశిక్ష విధించారు. ఇది 2012తో పోల్చితే 50 శాతం తక్కువ. -
తల్లుల బాధ్యత..
కేరెంటింగ్ పసిపిల్లలకు స్నానానికి ముందు ఏదైనా నూనెతో మసాజ్ చేస్తుంటారు. దాంతో పాటు బ్రెడ్‌తో స్క్రబ్ కూడా చేస్తే వారి మృదువైన చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది. అందుకోసం 3-4 బ్రెడ్ ముక్కలను పచ్చిపాలలో నానబెట్టాలి. అందులోకి పాలు ఇంకి మెత్తగా అయ్యాక వాటిని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పిల్లల చర్మానికి స్క్రబ్‌లా వాడాలి. అలా ప్రతిరోజూ చేస్తే మృదువైన చర్మంతో పాటు వారికి ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటాయి. చిన్నారులకు డైపర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి వాడిన ప్రదేశాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే డైపర్ క్రీమ్ తయారు చేసుకోవడం మంచిది. దానికి ఓ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. దాని పైన ఓ మూతలో కొద్దిగా కొబ్బరి నూనె, రెండు చేమంతి పూలు వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ కొబ్బరి నూనె ఎల్లో క్రీమ్‌లా తయారవుతుంది. దాన్ని డైపర్ల అంచుకు రాస్తే అది మంచి లోషన్‌గా ఉపయోగపడుతుంది. -
ఎంత కష్టమొచ్చిందో..!
పసిపిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య అల్వాల్ : అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన కన్న తల్లే పసి పిల్లలకు పాలల్లో విషమిచ్చి తాను చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...గుంటూరుకు చెందిన సీతారామిరెడ్డి, రాధ (28)లకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కానాజిగూడ తిరుమల్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి నిత్య (2.5ఏళ్లు) యశ్వంత్‌రెడ్డి (11 నెలలు) సంతానం. సీతారాంరెడ్డి ఈసిఐఎల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అధ్యాపకుడిగా పని చేస్తూ సాయంత్రం వేళల్లో భార్య, భర్తలిద్దరూ ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సీతారాంరెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు మూసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా భార్య పలుకకపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో తలుపు తొలగించి లోపలికి వెళ్లి చూడగా, హాలులో మంచంపై ఇద్దరు చిన్నారులు నోటి నుంచి నురుగలు కక్కుతూ మృతి చెంది ఉన్నారు. దీంతో అతను బెడ్రూంలోకి వెళ్లి చూడగా భార్య రాధ చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. దీంతో అతను బంధువులు, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు రాసిన సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘భర్తను వూర్చుకోలేక పోతున్నాను. నేను బతకలేను. నేను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు.. అంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా మధ్యాహ్నం 12.38 నిమిషాలకు రాధ తొందరగా రావాలని తన సెల్‌ఫోన్‌కు మెసెజ్ పంపినట్లు సీతారాంరెడ్డి పోలీసులకు తెలిపాడు. అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్, అల్వాల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
గాంధీ ఆసుపత్రిలో ఘటన హైదరాబాద్: ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే గర్భంలోనే ఓ శిశువు మృతిచెందటంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి మృతశిశువుతోపాటు ఇద్దరు మగ, ఒక ఆడ శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీశారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ఆరూరు గ్రామానికి చెందిన లక్ష్మికి రెండేళ్ల కిందట సీహెచ్.రాజన్నతో వివాహమైంది. కొన్ని నెలల కిందట గర్భందాల్చిన లక్ష్మి వైద్యపరీక్షల కోసం స్థానిక డాక్టర్లను సంప్రదించగా వారి సూచన మేరకు ఈ ఏడాది జూన్‌లో గాంధీ ఆస్పత్రిలో చేరింది. గైనకాలజీ విభాగ వైద్యులు లక్ష్మికి పరీక్షలు నిర్వహించి ఆమెకు ఒకే గర్భసంచిలో నాలుగు అండాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏడు నెలలు నిండిన తర్వాత గర్భంలోని ఓ శిశువు మృతి చెందినట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. అప్పుడే శస్త్రచికిత్స నిర్వహిస్తే మిగిలిన శిశువులు మృతి చెందే అవకాశం ఉందని భావించి ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందించారు. కడుపులోని మిగిలిన శిశువులతోపాటు తల్లికి ఎటువంటి ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నెలల నిండిన తర్వాత బుధవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి మృతశిశువుతోపాటు, ముగ్గురు శిశువులను బయటకు తీశారు. -
మాల్దాలో 11 మంది శిశువులు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గత మూడు రోజుల్లో 11 మంది శిశువులు మృతి చెందారు. మాల్దా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మూడు రోజుల్లో 11 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. బరువు తక్కువగా ఉండడం, శ్వాసకోస సంబంధ సమస్యలే శిశువుల మరణానికి కారణమని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఏ రషీద్ తెలిపారు. మాల్దా జిల్లాలో శిశువుల మరణాలు సాధారణంగా మారాయి. మెదడువాపుతో జూలైలో 12 మంది, జూన్ లో 9 మంది శిశువులు మరణించారు. -
శిశువుల ఆరోగ్యానికి భరోసా
నల్లగొండ టౌన్ :శిశుమరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చిన్నారులకు వచ్చే రోగాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం.. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో ఎక్కువశాతం మరణాలు నిమోనియా(శ్వాస సంబంధ), అతిసా రం, మలేరియా, ఇతర జ్వరాలతో పాటు పౌష్టికాహారలోపం కారణంగా సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చిన్నారులకు వచ్చే డయేరియా( నీళ్ల వేరేచనాలు) వ్యాధితోపాటు, తల్లిపాల ప్రా ముఖ్యత, అనుబంధ ఆహారంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి డయేరియా నివారణ పక్షోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య ఆరోగ సిబ్బందికి జిల్లా కేంద్రంలో వారం రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన 3లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను జిల్లాకు తెప్పించారు. వాటిని ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు పం పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి ప్రతి గ్రామంలో వై ద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇం టింటికీ తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు డయేరి యాపై అవగాహన కల్పిస్తారు. డయేరియా(నీళ్ల విరేచనాలు) రావడానికి గల కారణాలు, దాని వల్ల కలిగే అనర్థాలను వివరించి ఓఎస్ఆర్ ప్యాకె ట్లు, జింక్ ట్యాబ్లెట్లు అందజేస్తారు. పది హేను రోజుల పాటు నిర్వహించే ఈ కా ర్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది తో పాటు ఐసీడీఎస్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా, మహిళా సంఘాల సహకారం తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి డయేరియా పక్షోత్సవాల కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. - పి.ఆమోస్, జిల్లా వైద్యశాఖ అధికారి -
శత్రువులెవరో.. చిన్నారులకూ తెలుసు!!
మాటలు రాకపోయినా.. తమకు మిత్రులెవరో, శత్రువులెవరో చిన్నారులు కూడా సులభంగా గుర్తు పట్టేస్తారట. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో శిశువుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. చివరకు 9 నెలల పిల్లలు కూడా తమతో ఎవరెలా వ్యవహరిస్తున్నారో ఇట్టే గుర్తుపట్టేస్తారని, ఇతరుల సామాజిక సంబంధాలను వాళ్లు చాలా పక్కాగా గమనిస్తుంటారని పరిశోధనలో పాలుపంచుకున్న సైకాలజీ ప్రొఫెసర్ అమందా ఎల్. వుడ్‌వర్డ్ తెలిపారు. 9 నెలల వయసున్న మొత్తం 64 మంది పిల్లలను బృందాలుగా చేసి, వారికి ఇద్దరు పెద్దవాళ్ల వీడియోలు చూపించారు. వాళ్లు రెండు వేర్వేరు రకాల ఆహారాలు తిన్నారు. అలా తినేటప్పుడు కూడా అయితే పాజిటివ్‌గా, లేకపోతే నెగిటివ్‌గా వారు స్పందించారు. ఈ వీడియోలను పిల్లలకు చూపించారు. అప్పుడు వాళ్లు ఈ ఇద్దరి విషయంలో వేర్వేరుగా తమ భావాలు పలికించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తినేటప్పుడు శిశువులు వాళ్ల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తారని, దాన్ని బట్టే సామాజిక సంబంధాలు నిర్వహిస్తారని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కేథరిన్ డి.కింజ్లర్ తెలిపారు.