చిన్నారుల మృత్యుఘోష.. | Ten kids were killed by illness | Sakshi
Sakshi News home page

చిన్నారుల మృత్యుఘోష..

Published Wed, Nov 8 2017 3:29 AM | Last Updated on Wed, Nov 8 2017 2:48 PM

Ten kids were killed by illness - Sakshi

నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

నల్లగొండ: తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన ఆ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్దిరోజులకే అందులోకి అడుగుపెడు తున్న శిశువులకు అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమవుతున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలుగానే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలికాలంలో వరుసగా 10 మంది శిశువులు మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతు న్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పిం చేందుకు నల్లగొండ, దేవరకొండలో శిశుగృహా లు ఏర్పాటు చేశారు.  

వివిధ కారణాలతో దేవరకొండ కేంద్రాన్ని కూడా నల్లగొండలోనే కలిపి నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశుగృహానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంఖ్య పది మంది చిన్నారులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ రెండు గృహాల్లో కలిపి మొత్తం 50 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శిశుగృహలో పదిమంది దాటితే హైదరాబాద్‌ లోని శిశువిహార్‌కు తరలించాలి. కానీ, అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేకపోవడంతో నల్లగొండలోనే ఉంచుతున్నారు. అయితే నల్ల గొండ కేంద్రంలోని చిన్నారులకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అధికారులు అందిస్తున్న పోషకాహారం లో లోపాలు ఉండటంతో శిశువులకు ఏ కొద్దిపాటి అనారోగ్య సమస్య తలెత్తినా అల్లాడిపోతున్నారు. శిశువుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే కావడం, వారి వయస్సు రోజుల వయస్సు నుంచి రెండేళ్ల లోపే ఉండటంతో అనారోగ్య సమస్యలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

ప్రాణాలతో చెలగాటం..
శిశుగృహాల్లో చేరుతున్న చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. తల్లినుంచి వేరైన పిల్లలకు ముర్రుపాలు అందకపోవడం ప్రధాన సమస్య అయితే ఆ తర్వాత అధికా రులు అందించాల్సిన పౌష్టికాహారం కూడా సమపాళ్లలో అందడం లేదు. పాల డబ్బాలు కొనేందుకు కూడా అధికారుల వద్ద డబ్బులు లేకపోవడంతో విజయ డెయిరీ.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెట్రా పౌడర్‌ ప్యాకెట్లను వాడుతున్నారు.

ప్యాకెట్లలోని పౌడర్‌లో పౌష్టికాహార గుణాలు తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం శిశువుల ఎదుగుదలపై పడుతుందని వైద్యులు తెలిపారు. పోషకాహార లోపంతోనే చిన్నారులు వాంతులు, విరోచనాలు, శ్వాసకోస వ్యాధుల తో ఆస్పత్రుల్లో చేరారు.  పిల్లలకు ఇస్తున్న పాల పౌడర్‌లో లోపం ఉండటంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని తేలింది. టెట్రా పౌడర్‌ వాడటం వల్ల కిడ్నీలపై దాని ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. మరో శిశువుకు పాలు పట్టించడంలో ఆయాలు సరైన పద్ధతి పాటించకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. శిశువుకు పట్టిన పాలు శ్వాసనాళానికి అడ్డుపడ టంతో ఊపిరి పీల్చు కోలేకపోయింది. ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొ చ్చినా వైద్యులు కాపాడలేకపోయారు. ఇలాంటి  సమస్యను ఎదుర్కొన్న 20 మందిని  ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. 

సకాలంలో వైద్యం అందక.. 
శిశుగృహలోని పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటికప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గి బరువు తక్కువగా ఉన్న పిల్లలకు వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు.  వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో వెనుకాడుతున్నారు. చివరికి శిశు వులను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు నెలల కాలంలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు పదిమంది శిశువులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం 8 మంది చిన్నారులు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని నిలోఫర్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement