యూపీలో ఘోర రైలు ప్రమాదం | Train Hits School Bus in UP Kushinagar | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రైలు ప్రమాదం

Published Thu, Apr 26 2018 9:42 AM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు.  కుశినగర్‌ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement